ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Air India Passengers: రష్యాలో చిక్కుకున్న ప్రయాణికులు.. వారి కోసం బయలుదేరి విమానం

ABN, Publish Date - Jul 19 , 2024 | 06:24 PM

ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో విమానాన్ని రష్యాలోని క్రాస్నోయార్క్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు.

ముంబయి, జులై 19: ఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో గురువారం సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో విమానాన్ని రష్యాలోని క్రాస్నోయార్క్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దింపారు. ఆ క్రమంలో ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది ఆ ఎయిర్ పోర్ట్‌లో చిక్కుకుపోయారు. అయితే ఆ ప్రయాణికులను గమ్యస్థానం శాన్‌ఫ్రాన్సిస్కో చేర్చేందుకు ఎయిర్ ఇండియా సంస్థ చర్యలు చేపట్టింది.

Also Read: Ayodhya: బీజేపీపై మహువా మొయిత్రా వ్యంగ్యాస్త్రాలు

Also Read: Visakhapatnam: పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో మృత్యు ఒడిలోకి ‘తండ్రి’


అందులోభాగంగా ఈ రోజు మధ్యాహ్నం ముంబయిలోని చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా విమానం రష్యా బయలుదేరి వెళ్లింది. ఈ మేరకు ఆ సంస్థ ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. గురువారం న్యూఢిల్లీ నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన బొయింగ్ 777 విమానంలో 225 మంది ప్రయాణికులతోపాటు 19 మంది సిబ్బంది ఉన్నారని వివరించింది. రెగ్యులేటరీ క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఈ విమానం ముంబయి నుంచి బయలుదేరి వెళ్లిందని ఎయిర్ ఇండియా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపంతో రష్యా విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

Also Read: Microsoft: మైక్రోసాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు.. ప్రపంచవ్యాప్తంగా నిలిచిన సేవలు..!

Also Read: New Delhi: విదేశీ పర్యాటకులను వెంబడించిన బాలికలు.. ఎందుకోసమంటే..


ఈ ఘటనపై రష్యా రాజధాని మాస్కోలోని రాయబారి కార్యాలయం శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించింది. ప్రయాణికులకు కోసం ముగ్గురు అధికారులు రంగంలోకి దిగారని తెలిపింది. ప్రయాణికుల భద్రతతోపాటు వారికి స్థానికంగా ఉండేందుకు ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అందుకోసం రష్యా విదేశీ వ్యవహారల మంత్రిత్వ శాఖ అధికారులతో మాట్లాడామని వివరించింది. ఇక ఈ ప్రయాణికులు రష్యా నుంచి శాన్‌ఫ్రాన్సిస్కోకు బయలుదేరి వెళ్లే వరకు ఇక్కడ ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వివరించింది.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 19 , 2024 | 06:26 PM

Advertising
Advertising
<