Ajit Pawar: రెండున్నరేళ్లు మీకూ అవకాశం ఇస్తాం.. ఆశావహులకు అజిత్ భరోసా
ABN, Publish Date - Dec 15 , 2024 | 08:58 PM
నాగపూర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అజిత్ పవార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మంత్రి పదవిని ఆశిస్తుంటారని, అయితే మంత్రి పదవులు పరిమితంగానే ఉంటాయని గుర్తు చేశారు.
నాగపూర్: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ (Maharashtra Cabinet Expansion)లో చోటుదక్కని ఆశావహ ఎమ్మెల్యేలు నిరాశచెందవద్దని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అన్నారు. ప్రభుత్వ పూర్తి పదవీకాలంలో రెండున్నరేళ్ల పాటు ఇతరులకు కూడా మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తామని చెప్పారు. నాగపూర్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ మంత్రి పదవిని ఆశిస్తుంటారని, అయితే మంత్రి పదవులు పరిమితంగానే ఉంటాయని గుర్తు చేశారు. మంత్రి పదవికి అందరూ అర్హులేనని చెప్పారు.
Maharashtra Cabinet Expansion: 'మహా' మంత్రులు వీరే.. ఏ పార్టీకి ఎన్నంటే
''ఐదేళ్ల పదవీకాలంలో ఇతరులకు కూడా రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవులకు అవకాశం ఇవ్వాలని మేము నిర్ణయించాం. ఆ ప్రకారం మరింత మందికి మంత్రులు, సహాయ మంత్రులుగా అవకాశం వస్తుంది. అందుకు తగినట్టుగా పలు జిల్లాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభిస్తుంది'' పవార్ తెలిపారు. గత మహాయుతి ప్రభుత్వంలో కూడా ఏడాదిన్నర పాటు మంత్రులుగా పనిచేసే అవకాశం కొందరికి కలిగిందని చెప్పారు.
పది రోజుల క్రితం అధికార పగ్గాలు చేపట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం తొలిసారి ఆదివారంనాడు మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. నాగపూర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో 39 మందికి దేవేంద్ర ఫడ్నవిస్ క్యాబినెట్‌లో చోటు దక్కింది. దీంతో క్యాబినెట్ సభ్యుల సంఖ్య 42కు చేరింది. మంత్రివర్గ విస్తరణలో బీజేపీకి 19, షిండే శివసేనకు 11, అజిత్ పవార్ ఎన్‌సీపీకి 9 మంత్రి పదవులు దక్కాయి. ముఖ్యమంత్రితో సహా క్యాబినెట్‌లో గరిష్టంగా 43 మందికి చోటుంటుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 'మహాయుతి' కూటమి ఘనవిజయం సాధించింది. బీజేపీ 132 సీట్లు గెలుచుకోగా, షిండే శివసేన 57, అజిత్ పవార్ ఎన్‌సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
PM Modi: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం
భారతీయ విద్యార్థులపై కెనడా కన్నెర్ర
For National News And Telugu News
Updated Date - Dec 15 , 2024 | 08:58 PM