ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elecitons: 17 సీట్లు ఫైనల్...తేల్చిచెప్పిన అఖిలేష్

ABN, Publish Date - Feb 19 , 2024 | 06:48 PM

లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్‌ కు అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ తుది ఆఫర్ ఇచ్చింది. 'ఇండియా' కూటమి భాగస్వామ్య పార్టీగా సీట్ల షేరింగ్‌లో ఫైనల్‌గా కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇస్తామని చెప్పింది.

లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో (Lok SAbha Eections) ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) నుంచి కాంగ్రెస్‌ (Congress)కు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi party) తుది ఆఫర్ ఇచ్చింది. 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి భాగస్వామ్య పార్టీగా సీట్ల షేరింగ్‌లో ఫైనల్‌గా కాంగ్రెస్‌కు 17 సీట్లు ఇస్తామంటూ చెప్పింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)కు సమాజ్‌వాదీ పార్టీ లేఖ రాసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పందించాల్సి ఉంది.


''కాంగ్రెస్‌ పార్టీకి అంతిమంగా 17 సీట్లు ఆఫర్ చేశాం. వారి (కాంగ్రెస్) అంగీకారాన్ని బట్టే రాయబరేలిలో రాహుల్ మంగళవారం జరిపే భారత్ జోడో న్యాయ్ యాత్రలో అఖిలేష్ పాల్గొనడం ఉంటుంది'' అని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన ప్రతినిధి రాజేంద్ర చౌదరి మీడియాకు తెలిపారు. కాంగ్రెస్‌కు ఏయే సీట్లు ఆఫర్ చేశారనే విషయం చెప్పేందుకు ఆయన నిరాకరించారు. కాగా, రాహుల్ గాంధీ 'న్యాయ్ యాత్ర' అమేథీలోకి సోమవారం అడుగుపెట్టింది. మంగళవారం రాయబరేలి వెళ్తుంది. కాంగ్రెస్ ఆహ్వానాన్ని అఖిలేష్ గతంలో స్వాగతిస్తూ రాయబేరిలిలో జరిగే యాత్రలో పాల్గొనేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.

Updated Date - Feb 19 , 2024 | 06:48 PM

Advertising
Advertising