ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Alcohol sales: జనవరి నుంచి టాస్మాక్‌లో ‘క్యూ ఆర్‌’ కోడ్‌తో మద్యం విక్రయాలు

ABN, Publish Date - Dec 26 , 2024 | 10:44 AM

రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి క్యూ ఆర్‌ కోడ్‌ విధానంలో మద్యం విక్రయాలు(Alcohol sales) జరుగనున్నాయి. టాస్మాక్‌ సంస్థ దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మద్యం విక్రయాల్లో దుకాణాల సిబ్బంది చేతివాటం ప్రదర్శించి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అధికంగా వసూలుచేస్తున్నట్లు ఫిర్యాదులందాయి.

- అధికారుల సన్నాహాలు

చెన్నై: రాష్ట్రవ్యాప్తంగా జనవరి నుంచి క్యూ ఆర్‌ కోడ్‌ విధానంలో మద్యం విక్రయాలు(Alcohol sales) జరుగనున్నాయి. టాస్మాక్‌ సంస్థ దుకాణాల ద్వారా మద్యం విక్రయిస్తున్న విషయం తెలిసిందే. మద్యం విక్రయాల్లో దుకాణాల సిబ్బంది చేతివాటం ప్రదర్శించి బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు అధికంగా వసూలుచేస్తున్నట్లు ఫిర్యాదులందాయి. అదే సమయంలో నకిలీ మద్యం విక్రయాలు కూడా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. వీటిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ఈ వార్తను కూడా చదవండి: New Year: కొత్త సంవత్సర వేడుకలు.. లక్షమంది పోలీసులతో భద్రత


ఇందులో భాగంగా టాస్మాక్‌ దుకాణాల్లో డిజిటల్‌ విధానంలో విక్రయాలు చేపట్టాలని నిర్ణయించింది. తొలివిడతగా రాణిపేట, రామనాథపురం, కాంచీపురం, శివగంగ(Ranipet, Ramanathapuram, Kanchipuram, Sivaganga), కరూర్‌, తిరుప్పూర్‌, తిరుచ్చి, పుదుకోట జిల్లాల్లో క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా మద్యం విక్రయించి రసీదులు అందజేసే విధానం ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ విధానాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం దుకాణాల్లో అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.


ఈ విషయమై టాస్మాక్‌ ఉన్నతాధికారి మాట్లాడుతూ... ప్రస్తుతం దుకాణ సిబ్బంది, వినియోగదారుల, గోదాముల సిబ్బందికి క్యూఆర్‌ కోడ్‌పై అవగాహన కల్పించామన్నారు. ఈ విధానంతో గోదాముల నుంచి దుకాణాలకు తరలించే మద్యం బాటిళ్ల వివరాలు తెలుసుకొనే అవకాశముందని తెలిపారు. అదే సమయంలో ఈ విధానంతో దుకాణా సిబ్బందిపై పనిభారం కూడా తగ్గుతుందన్నారు. ఈ విధానం అమలైన తర్వాత దుకాణానికి అవసరమైన మేర సిబ్బందిని ఉంచి, అదనపు ఉద్యోగులను ఇతర విభాగాలకు తరలిస్తామని వివరించారు.


ఈవార్తను కూడా చదవండి: Investigation: కర్త, కర్మ, క్రియ.. కేటీఆరే!

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

ఈవార్తను కూడా చదవండి: ఆహా.. ఏం ఐడియాగురూ.. వాట్సాప్‌ డీపీ మార్చి.. మెసేజ్‌ పంపి..

ఈవార్తను కూడా చదవండి: Pneumonia: పిల్లలపై న్యుమోనియా పంజా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 26 , 2024 | 10:44 AM