ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Delhi :నడ్డా అధ్యక్షతన బీజేపీ నేతల కీలక భేటీ

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:16 AM

లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందున బీజేపీ సీనియర్‌ నేతలు సోమవారం భేటీ అయ్యారు. పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

న్యూఢిల్లీ, జూన్‌ 3: లోక్‌సభ ఎన్నికల ఫలితాలకు ఒకరోజు ముందున బీజేపీ సీనియర్‌ నేతలు సోమవారం భేటీ అయ్యారు. పార్టీ చీఫ్‌ జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌తో పాటు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు కూడా పాల్గొన్నారు.

మూడోసారీ మెజారిటీ సీట్లతో కేంద్రంలో బీజేపీ సర్కారే వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాల నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలిసింది.

భేటీ అనంతరం పార్టీ నేత వినోద్‌ తావ్డే మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలో ఏడు దశల్లో నిర్వహించిన ఎన్నికలు, ఓటింగ్‌ సరళి, పోలింగ్‌ ఎలా జరిగిందనే దానితో పాటు రేపు జరగబోయే ఓట్ల లెక్కింపుపై విస్తృతంగా చర్చించాం.

కౌంటింగ్‌ కేంద్రాలకు పార్టీ ఏజెంట్లు సకాలంలో చేరుకునేలా దిశానిర్దేశం చేశాం. ఎక్కడైనా ఓట్ల లెక్కింపులో అనుమానాలుంటే పార్టీ ఆఫీసు బేరర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించాం’ అని వెల్లడించారు.

Updated Date - Jun 04 , 2024 | 04:17 AM

Advertising
Advertising