Modi 3.0 Cabinet: కేంద్ర మంత్రివర్గ కూర్పు.. మారినవి, మార్పు లేని శాఖలివే..
ABN, Publish Date - Jun 10 , 2024 | 09:10 PM
కేంద్ర మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది. అయితే చాలా శాఖలకు పాత వారినే కొనసాగించారు. వివిధ శాఖలకు మారిన మంత్రులెవరు, కొత్త మంత్రులెవరు అనేది తెలుసుకుందాం.
ఢిల్లీ: ముచ్చటగా మూడో సారి మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన కేబినెట్ కూడా జూన్ 9న మిగతా మంత్రుల ప్రమాణ స్వీకారం కూడా రాష్ట్రపతి భవన్లో అట్టహసంగా జరిగింది. అయితే సోమవారం మంత్రులతో ప్రధాని మోదీ తొలిసారి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘంగా చర్చలు జరిపారు. మంత్రులకు ఇచ్చే శాఖలపై క్లారిటీ వచ్చింది. అయితే చాలా శాఖలకు పాత వారినే కొనసాగించారు. వివిధ శాఖలకు మారిన మంత్రులెవరు, కొత్త మంత్రులెవరు అనేది తెలుసుకుందాం.
మంత్రులు మార్పు లేని శాఖలు
రక్షణ శాఖ... రాజ్ నాథ్ సింగ్
హోం శాఖ.. అమిత్ షా
విదేశీ వ్యవహారాలు.. జైశంకర్
ఆర్ధిక శాఖ..నిర్మలా సీతారామన్
రోడ్లు రహదారులు..నితిన్ గడ్కరీ
వాణిజ్యం.. పీయూష్ గోయల్
విద్యాశాఖ.. ధర్మేంద్ర ప్రదాన్
అటవీశాఖ.. భూపేంద్ర యాదవ్
గిరిజన శాఖ.. జ్యువల్ ఓరం
ఓడరేవులు, షిప్పింగ్ - సర్బానంద సోనోవాల్
న్యాయశాఖ.. అర్జున్ రామ్ మేఘవాల్
రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖ..అశ్విని వైష్ణవ్
మారిన శాఖలు
సీఆర్ పాటిల్.. జల శక్తి
మన్ సుఖ్ మాండవీయ..క్రీడలు, యువజన,కార్మిక ఉపాధి
గజేంద్ర సింగ్ షెకావత్ .. సాంస్కృతిక,పర్యాటక శాఖ
కిరణ్ రిజిజు.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
కుమార స్వామి.. భారీ పరిశ్రమలు,ఉక్కు శాఖ
కిషన్ రెడ్డి.. బొగ్గు గనుల శాఖ
రామ్మోహన్ నాయుడు.. పౌర విమానయాన శాఖ
Updated Date - Jun 10 , 2024 | 09:10 PM