Amarnath Yatra: జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర, రిజిస్ట్రేషన్ ఎప్పట్నించంటే..?
ABN, Publish Date - Apr 14 , 2024 | 06:54 PM
ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది జూన్ 29 నుంచి ప్రారంభమై రెండు నెలల పాటు జరుగనుందని, ఆగస్టు 19తో యాత్ర ముగుస్తుందని అమర్‌నాథ్ బోర్డు ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అమర్‌నాథ్ యాత్ర కోసం ఈనెల 15 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది.
జమ్మూ: ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) ఈ ఏడాది జూన్ 29 నుంచి ప్రారంభమై రెండు నెలల పాటు జరుగనుందని, ఆగస్టు 19తో యాత్ర ముగుస్తుందని అమర్‌నాథ్ బోర్డు ఆదివారంనాడు ఒక ప్రకటనలో తెలిపింది. అమర్‌నాథ్ యాత్ర కోసం ఏప్రిల్ 15 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొంది.
BJP Manifesto 2024: బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు ఇవే..
యాత్రలో భాగంగా అమర్‌నాథ్ గుహకు చేరుకునే జంట రూట్లలో సుమారు 12 క్రిటికల్ స్పాట్స్‌ను గురించారు. ఈ ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్ పోలీసులు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్, సీఆర్‌పీఎఫ్ బలగాలతో కూడిన మౌంటైన్ రెస్క్యూ టీమ్స్ (MRTs)ను మోహరించనున్నారు. జమ్మూకశ్మీర్‌లో జూన్‌లో అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమై రెండు నెలల పాటు జరుగుతుందని జమ్మూకశ్మీర్ ఎంఆర్‌టీ టీమ్ ఇన్‌చార్జి రామ్ సింగ్ సలాథియా తెలిపారు. లక్షలాది మంది యాత్రికులు ఇందులో పాల్గొంటారని, యాత్రలో ఎలాంటి సంక్లిష్ట పరిస్థఇతులు ఎదురైనా భక్తులకు సహాయం అందించేందుకు సాంబ జిల్లాలో ఎంఆర్‌టీకి తగిన శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. కీలక ప్రాంతాంల్లో సైనికులను మోహరిస్తామని, భక్తులకు ఎలాంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఎదురైనా వారు సహాయం అందిస్తారని, సరికొత్త టెక్నాలజీ, సామగ్రితో టీమ్స్‌ను సిద్ధంగా ఉంచుతున్నామని వివరించారు. ఇంతవరకూ జమ్మూ కశ్మీర్ పోలీసు విభాగానికి చెందిన 1,300 మందికి సంపూర్ణ శిక్షణ ఇచ్చామని చెప్పారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.
Updated Date - Apr 14 , 2024 | 06:54 PM