Lok Sabha Elections 2024: తొలి విడత పోలింగ్...మణిపూర్‌లో హింస
ABN, Publish Date - Apr 19 , 2024 | 03:38 PM
లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత పోలింగ్‌లో భాగంగా మణిపూర్‌లో శుక్రవారంనాడు హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ ఈస్ట్‌లోని ఖోంగ్మాన్‌లో ఎన్నికల ప్రకియను అడ్డుకునేందుకు సాయుధ దుండగులు ఓ పోలింగ్ బూత్‌లలోకి ప్రవేశించారని, ప్రాక్సీ ఓటింగ్ చేశారని వార్తలు వెలువడ్డాయి.
ఇంఫాల్: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) తొలి విడత పోలింగ్‌లో భాగంగా మణిపూర్(Manipur)లో శుక్రవారంనాడు హింసాత్మక ఘటనలు వెలుగుచూశాయి. బూత్‌లను స్వాధీనం చేసుకోవడం, ఈవీఎంల ధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంఫాల్ ఈస్ట్‌లోని ఖోంగ్మాన్‌లో ఎన్నికల ప్రకియను అడ్డుకునేందుకు సాయుధ దుండగులు ఓ పోలింగ్ బూత్‌లలోకి ప్రవేశించారని, ప్రాక్సీ ఓటింగ్ చేశారని వార్తలు వెలువడ్డాయి.
Elections 2024: ఎన్నికల వేళ హింసతో అట్టుడుకుతున్న బెంగాల్.. కూచ్ బిహార్ లో రాళ్లదాడి..
మోయిరాంగ్ ప్రాంతంలోని థామన్‌పోక్కిలో ఒక పోలింగ్ బూత్ సమీపంలో శుక్రవారం ఉదయం కాల్పులు చోటుచేసుకోవడంతో ఆ ప్రాంతవాసులు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో పరుగులు తీశారు. ఇందుకు సంబధించి 25 సెకన్ల వీడియో సామాజిక మాధ్యమంలో పోస్ట్ అయింది. తొలుత రెండు సార్లు కాల్పులు వినిపించగా, ఆ తరువాత కూడా కాల్పుల మోతలు ఆగలేదని, 10 సెకండ్ల పాటు కాల్పులు జరిగాయని తెలుస్తోంది. కాగా, మణిపూర్‌లోని ఇన్నర్ మణిపూర్, ఔటర్ మణిపూర్ నియోజకవర్గాల్లోనే ఈ కాల్పులు చోటుచేసుకున్నాయా అనేది వెంటనే తెలియలేదు. 2019లో ఇన్నర్ మణిపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి తౌనవోజామ్ బసంత కుమార్ సింగ్ గెలుపొందారు. ఈసారి కూడా ఆయన పోటీలో ఉన్నారు. ఔటర్ మణిపూర్‌లో నాగాపీపుల్స్ నేత కచుయీ టిమోతీ జిమిక్ గెలుపొందగా, ఈసారి కూడా ఆయన పోటీ చేస్తున్నారు. కాగా, మణిపూర్ గత ఏడాది మేలో ప్రారంభమైన జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడికింది. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది ఇళ్లు నిరాశ్రయులయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
Updated Date - Apr 19 , 2024 | 03:38 PM