ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaish video: ఫిల్మ్ పోస్టర్‌తో జైషే వీడియో... షేర్ చేయొద్దంటూ పోలీసులు వార్నింగ్

ABN, Publish Date - Jul 22 , 2024 | 07:54 PM

బాలీవుడ్ చిత్రం 'ఫాంటమ్' పోస్టర్‌తో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ సోమవారంనాడు విడుదల చేసిన ఓ ఆడియోపై జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దంటూ ప్రజలకు అదేశాలు జారీ చేశారు.

శ్రీనగర్: బాలీవుడ్ చిత్రం 'ఫాంటమ్' (Phantaom) పోస్టర్‌తో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (Jaish-e-Muhammad) సోమవారంనాడు విడుదల చేసిన ఓ ఆడియోపై జమ్మూకశ్మీర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ వీడియోను ఎవరూ షేర్ చేయవద్దంటూ ప్రజలకు అదేశాలు జారీ చేశారు. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)లోని సెక్షన్ 13, 18 కింద నేరమవుతుందని హెచ్చరించింది.

Pak terrorists: భారత్ సరిహద్దుల్లో పాక్ 'ఉగ్ర' పన్నాగం, సైన్యం దగ్గరుండి మరీ...


జైషే ఉగ్రవాద సంస్థ నుంచి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు 5 నిమిషాల 55 నిమిషాల నిడివి గల వీడియో విడుదలైందని జేకే పోలీసులు సామాజిక మాధ్యమం 'ఎక్స్' పోస్ట్‌లో ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరూ ఈ వీడియోను ఒకరికొకరు షేర్ చేసుకోరాదని, సంబంధిత వీడియో అందినప్పుడు టెలిఫోన్ నెంబర్, డాటా, అందిన సమయం తమకు తెలియజేయాలని, ఆ సమాచారాన్ని పోలీసు అధికారులు, ప్రభుత్వ అధికారులు వెంటనే తమ పై అధికారుల దృష్టికి తప్పనిసరిగా తీసుకువెళ్లాలని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. జమ్మూలో ఇటీవల కాలంలో ఉగ్రదాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.

For Latest News and National News click here

Updated Date - Jul 22 , 2024 | 08:23 PM

Advertising
Advertising
<