Lok Sabha Elections: అమిత్‌షా నొయిడా పర్యటన రద్దు... ఫోనులోనే సభికులను ఉద్దేశించి ప్రసంగం
ABN, Publish Date - Apr 13 , 2024 | 09:14 PM
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా శనివారం సాయంత్రం జరగాల్సిన పర్యటన రద్దయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తేలికపాటి వర్షలు జల్లులు పడటం, వాతావరణ ప్రతికూలత తలెత్తడంతో ఆయన పర్యటన రద్దయింది. అయితే, నొయిడా సభకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఫోనులోనే అమిత్‌షా ప్రసంగించారు.
నొయిడా: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని నొయిడాలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit shah) శనివారం సాయంత్రం జరగాల్సిన పర్యటన రద్దయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో తేలికపాటి వర్షలు జల్లులు పడటం, వాతావరణ ప్రతికూలత తలెత్తడంతో ఆయన పర్యటన రద్దయింది. అయితే, నొయిడా సభకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి ఫోనులోనే అమిత్‌షా ప్రసంగించారు.
Lok Sabha Polls: మోదీ చేతుల మీదుగా బీజేపీ మేనిఫెస్టో రెడీ
మూడోసారి ప్రధానమంత్రిగా మోదీ పగ్గాలు చేపట్టేందుకు ఆయన నాయకత్వాన్ని బలపరచాలని, ఇందులో భాగంగా నొయిడా బీజేపీ అభ్యర్థి మహేష్ శర్మను భారీ మెజారిటీతో గెలిపించాలని అమిత్‌షా కోరారు. శర్మ విజయోత్సవానికి తప్పనిసరిగా వస్తానని హామీ ఇచ్చారు. వాతావరణం సరిగా లేకపోవడంతో నొయిడా రాలేకపోతున్నందుకు మన్నించాలని కోరారు. గౌతమ్ బుద్ధ్ నగర్ నియోజకవర్గంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది. ప్రస్తుత బీజేపీ ఎంపీ డాక్టర్ మమహేష్ శర్మ వరుసగా మూడోసారి బౌద్ధనగర్ నుంచి విజయాన్ని ఆశిస్తున్నారు. ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ జరుగనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 13 , 2024 | 09:14 PM