జీఎస్టీని తగ్గించాలంటే.. క్షమాపణ చెప్పిస్తారా?
ABN, Publish Date - Sep 14 , 2024 | 04:10 AM
జీఎస్టీని సరళతరం చేయాలని కోరిన అన్నపూర్ణ గ్రూప్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల క్షమాపణలు చెప్పించుకొన్నారంటూ వైరల్ అయిన వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
చెన్నై-ఆంధ్రజ్యోతి/న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: జీఎస్టీని సరళతరం చేయాలని కోరిన అన్నపూర్ణ గ్రూప్ హోటల్స్ యజమాని శ్రీనివాసన్‌తో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల క్షమాపణలు చెప్పించుకొన్నారంటూ వైరల్ అయిన వీడియో రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. ప్రజలు తమ సమస్యలు చెప్పకూడదా అని కాంగ్రెస్ పార్టీ నిర్మలను నిలదీసింది. ‘బహిరంగ వేదికలపై పదేపదే ఇలా చేయడం నిర్మలకు అలవాటుగా మారింది’ అని ఖర్గే విమర్శించారు. ‘ఓ చిన్న వ్యాపారి సులభతర జీఎ్‌సటీ విధానం కావాలని అడిగితే అహంకారంతో అగౌరవపరుస్తారు. అదే కోటీశ్వరుడైన మిత్రుడు కోరితే చట్టాలను మార్చేస్తారు. జాతీయ సంపదను అతడికి కట్టబెడతారు’ అని రాహుల్ ఆరోపించారు. నిర్మల ఈ నెల 11న కోయంబత్తూరులో వ్యాపారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసన్ జీఎస్టీని ప్రస్తావించారు. బన్‌పై జీఎ్‌సటీ లేదని.. కానీ దానిపై క్రీమ్ రాస్తే 18్% జీఎ్‌సటీ వేస్తున్నారని.. దీంతో కస్టమర్లు ఈ రెంటీని వేర్వేరుగా అడుగుతున్నారని, క్రీమ్ తామే బన్‌పై పూసుకుంటామని చెబుతున్నారని ఆయన చెప్పారు. ఉత్తరాదివారు స్వీట్లు ఎక్కువ తింటారని.. వాటిపై మంత్రి 5 శాతమే జీఎ్‌సటీ వేశారని.. దక్షిణాదిన, తీపి, ఉప్పు, కాఫీ కలిపి తీసుకుంటారని.. దీనిపై మాత్రం 12% వేశారని జనం అనుకుంటున్నారని.. జీఎ్‌సటీ గందరగోళంతో కంప్యూటర్ కూడా పనిచేయడం లేదని నవ్వుతూ వ్యాఖ్యానించారు. ఆయన చెప్పింది పరిశీలిస్తానని నిర్మల చెప్పారు. అయితే, ఈ వ్యవహారంపై మర్నాడు శ్రీనివాసన్.. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదంటూ నిర్మలకు క్షమాపణ చెప్పారు.
Updated Date - Sep 14 , 2024 | 04:11 AM