ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Paper Leaks: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే ఆ శిక్షలు.. కఠినంగా అమలు చేయనున్న కేంద్రం

ABN, Publish Date - Jun 22 , 2024 | 05:36 PM

నీట్ యూజీ 2024, యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు(Paper Leaks) సంచలనం సృష్టిస్తున్న వేళ.. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కఠిన చట్టాన్ని శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది.

ఢిల్లీ: నీట్ యూజీ 2024, యూజీసీ నెట్ ప్రవేశ పరీక్షల్లో అవకతవకలు(Paper Leaks) సంచలనం సృష్టిస్తున్న వేళ.. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలకు కేంద్రం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కఠిన చట్టాన్ని శుక్రవారం అందుబాటులోకి తెచ్చింది.

ఈ చట్టం కింద ప్రవేశ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. రూ.కోటి వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ప్రభుత్వ పరీక్షల(అక్రమాల నిరోధక) చట్టం-2024కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరిలో ఆమోదం తెలపగా, కేంద్రం తాజాగా చట్ట నిబంధనలను నోటిఫై చేసింది.


ఈ నెల 21 నుంచే ఈ చట్టం అమల్లోకి వచ్చింది. నీట్, నెట్‌ పేపర్‌ లీకుల నేపథ్యంలో ఈ చట్టాన్ని నోటిఫై చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన ఈ చట్టాన్ని ఎప్పుడు అమలు చేస్తారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రశ్నించిన మరుసటి రోజే దీనిపై నోటిఫికేషన్‌ వెలువడింది.

ఇందుకు సంబంధించి న్యాయశాఖ నిబంధనలు రూపొందిస్తున్నట్టు కేంద్ర మంత్రి చెప్పారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌ బిల్లు ఫిబ్రవరి 6న లోక్ సభలో ఆమోదం పొందగా.. 9న రాజ్యసభ ఆమోదించింది. అదే నెల 12న రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. యూపీఎస్సీ, రైల్వే ప్రవేశ పరీక్షలు, ఎస్ఎస్‌సీ, బ్యాంకింగ్‌ నియామకాలు తదితర పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకే కేంద్రం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా నీట్ పరీక్ష పత్రం లీకేజీ ఆందోళనలు జరుగుతున్న వేళ చట్టం అమల్లోకి తీసుకొచ్చారు.

NEET Paper Leakage: నీట్ పేపర్ లీకేజీపై కేంద్రం దిద్దుబాటు.. నిపుణుల కమిటీ ఏర్పాటు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 22 , 2024 | 05:37 PM

Advertising
Advertising