ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పేజర్‌ పేలుడు వ్యవస్థ భారత్‌లోకి రాకుండా అడ్డుకోవాలి!

ABN, Publish Date - Oct 02 , 2024 | 03:39 AM

పేజర్‌ పేలుడు వ్యవస్థ.. భారత్‌లోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, హిజ్బుల్లా తీవ్రవాదులకు చెందిన పేజర్లు, వాకీ-టాకీలను పేల్చివేయడం ద్వారా లెబనాన్‌కు ఇజ్రాయెల్‌ మాస్టర్‌స్ర్టోక్‌ ఇచ్చిందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు.

  • ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర

న్యూఢిల్లీ, అక్టోబరు 1: పేజర్‌ పేలుడు వ్యవస్థ.. భారత్‌లోకి ప్రవేశించకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, హిజ్బుల్లా తీవ్రవాదులకు చెందిన పేజర్లు, వాకీ-టాకీలను పేల్చివేయడం ద్వారా లెబనాన్‌కు ఇజ్రాయెల్‌ మాస్టర్‌స్ర్టోక్‌ ఇచ్చిందని భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ అన్నారు. ఈ ఆపరేషన్‌ ఒక్కరోజులో జరిగింది కాదని, ఏళ్ల తరబడి ఇజ్రాయెల్‌ దీనిపై కసరత్తు చేసిందన్నారు. అయితే, ఇలాంటి వ్యవస్థలు భారత్‌లోకి ప్రవేశించకుండా సప్లయ్‌ చైన్‌ను ఎక్కడికక్కడ అడ్డుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన ‘చాణక్య డిఫెన్స్‌ డైలాగ్స్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి స్థిరంగా ఉందని, కానీ, సాధారణస్థాయిలో లేదని ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర తెలిపారు.

చైనా-భారత్‌ల మధ్య దౌత్యపరమైన చర్చల ద్వారా మాత్రమే సానుకూల పరిస్థితులు ఏర్పడతాయని, అక్కడ ఎలాంటి చర్యలు చేపట్టాలన్నా క్షేత్రస్థాయిలో ఉన్న మిలటరీ కమాండర్ల ప్రణాళికలపై ఆధారపడి ఉంటుందన్నారు. అయితే, 2020, ఏప్రిల్‌కి ముందున్న పరిస్థితిని పునరుద్ధరించాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. భారత సరిహద్దు వెంబడి చైనా గ్రామాలను నిర్మిస్తోందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘‘చైనా కృత్రిమ వలసలను ప్రోత్సహిస్తోంది. అయినా ఎలాంటి ఇబ్బందీ లేదు. అది వారి దేశమే. మనకు కూడా సరిహద్దు వెంబడి మోడల్‌ గ్రామాలు ఉన్నాయి’’ అని ఉపేంద్ర వ్యాఖ్యానించారు.

Updated Date - Oct 02 , 2024 | 03:39 AM