Kejriwal: ఇదేం పద్ధతి.. జైలులో కేజ్రీవాల్‌ను కలువనీయలేదు..?
ABN, Publish Date - Apr 13 , 2024 | 02:09 PM
లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ను జైలులో కలిసేందుకు ఆయన భార్య సునీత వచ్చారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు.
ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. కేజ్రీవాల్‌ను (Kejriwal) జైలులో కలిసేందుకు ఆయన భార్య సునీత వచ్చారు. కేజ్రీవాల్‌ను కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ఇదే అంశంపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు స్పందించారు. కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కేజ్రీవాల్- సునీత జరిగిన ఘటన అమానవీయం అని మండిపడ్డారు.
BJP: అట్టహాసంగా అమిత్‌షా రోడ్‌షో.. మోదీ నినాదాలతో దద్దరిల్లిన మదురై
క్రిమినల్స్ కన్నా దారుణమా..?
‘తీవ్ర నేరాలు చేసిన క్రిమినల్స్ కూడా బ్యారక్‌లలో తమకు కావాల్సిన వారితో సమావేశం అవుతారు. ఢిల్లీలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నికైన అరవింద్ కేజ్రీవాల్‌ను అతని సతీమణి బ్యారక్‌లో కలిసి మాట్లాడే వీలు లేదు. ఇద్దరి మధ్య గ్లాస్ రూపంలో ఉన్న గోడ ఉంది. అక్కడ ఉన్న కిటికీల్లోంచి చూసి మాట్లాడే పరిస్థితి. ఎందుకు మానవత్వం చూపకుండా ప్రవర్తిస్తున్నారు అని’ ఆప్ నేత సంజయ్ సింగ్ మండిపడ్డారు.
విలువలు లేవా..?
‘గదిలోకి వచ్చి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వలేదు. కనీసం కిటికీల్లోంచి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. కేజ్రీవాల్ విషయంలో అధికారులు నైతిక విలువలు మరచిపోయారు. అరవింద్ కేజ్రీవాల్‌ను కేంద్ర ప్రభుత్వం వేధిస్తోంది. జైలులో ఉండాల్సిన కనీస హక్కులను కల్పించడం లేదు. కేజ్రీవాల్‌తో తాను, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సమావేశం కావాల్సి ఉంది. చివరి క్షణంలో సమావేశం రద్దు చేశారు అని’ సంజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Video: సీఎం కోసం స్వీట్ షాప్‌కు వెళ్లిన రాహుల్ గాంధీ..తర్వాత ఏమైందంటే
మరిన్ని జాతీయ వార్తల కోసం
Updated Date - Apr 13 , 2024 | 02:11 PM