Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ.. అందుకు నిరాకరించిన న్యాయస్థానం
ABN, Publish Date - Apr 10 , 2024 | 01:45 PM
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. తాను కోరిన ఓ విజ్ఞప్తిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బుధవారం కొట్టివేసింది.
మద్యం కుంభకోణానికి (Delhi Liquor Scam) సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Money Laundering Case) అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) తాజాగా మరో ఎదురుదెబ్బ తగిలింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సమయంలో తన లాయర్లను కలిసేందుకు అదనపు సమయం ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిని ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) బుధవారం కొట్టివేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌కు వారానికి రెండుసార్లు మాత్రమే తన లాయర్లను కలవడానికి అనుమతి ఉంది. అయితే.. వారానికి ఐదు సార్లు కలిసేలా అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టుని కోరారు. ఆ విజ్ఞప్తిని న్యాయస్థానం రిజెక్ట్ చేయడంతో.. ఇంతకుముందులా వారానికి రెండుసార్లు మాత్రమే లాయర్లను కలవడానికి వీలుంటుంది.
బ్రౌన్ రైస్‌తో బోలెడన్ని లాభాలు.. ఈ సమస్యలన్నీ దూరం
మరోవైపు.. తన అరెస్ట్, రిమాండ్‌ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) పిటిషన్ దాఖలు చేసిన కేజ్రీవాల్‌కు నిరాశే ఎదురైంది. అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధం కాదని.. మనీలాండరింగ్‌పై ఈడీ (ED) తగిన ఆధారాలు చూపించిందని.. గోవా ఎన్నికలకు డబ్బు ఇచ్చినట్లు అప్రూవర్ చెప్పారని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ముంచు ఉంచిన ఫైల్స్, మెటీరియల్‌ని బట్టి చూస్తే.. ‘మాండేట్ ఆఫ్ లా’ను ED అనుసరించిందని స్పష్టమవుతుందని తెలిపింది. ముఖ్యమంత్రికి ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఉండదని జస్టిస్ స్వర్ణకాంత శర్మతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. దీంతో.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని (Supreme Court) ఆశ్రయించారు. ఈమేరకు.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసినట్లు కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ తెలిపారు. తన అరెస్ట్‌పై హైకోర్టు చేసిన వ్యాఖ్యలఫై కూడా ఆ పిటిషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
అక్కడ మూగబోయిన ప్రచారం.. కానరాని పెద్ద నేతలు.. కారణం ఇదేనా?
ఇదిలావుండగా.. కేజ్రీవాల్ ఆరెస్ట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తమ నేతని ఎదుర్కొనే ధైర్యం లేకే ఇలా అరెస్ట్ చేయించారంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు. తాజాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ (MP Sanjay Singh) మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఢిల్లీ ముఖ్యమంత్రిని జైల్లో ఉంచాలని కోరుకుంటోంది. రెండు రోజుల క్రితం కేజ్రీవాల్ తన లాయర్‌ని కలిశారు. అప్పుడు ఆయన ఓ సందేశం ఇచ్చారు. ఎమ్మెల్యేలంతా తమ ప్రాంతాలకు వెళ్లి, ప్రజల సమస్యలను వినాలని ఆదేశించారు. దీని ఆధారంగా.. కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా విచారణ జరిపిస్తున్నారు. కుటుంబ సభ్యులు, న్యాయవాదుల్ని కలవకుండా అడ్డుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు’’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Apr 10 , 2024 | 01:48 PM