Delhi High Court: బెయిల్ వచ్చినా.. మంగళవారం వరకు జైల్లోనే..
ABN, Publish Date - Jun 21 , 2024 | 06:11 PM
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కేజ్రీవాల్‌కు ట్రయిల్ కోర్టు ఇచ్చిన సాధారణ బెయిల్ ఆదేశాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 21: ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఆ రాష్ట్ర హైకోర్టు ఝలక్ ఇచ్చింది. కేజ్రీవాల్‌కు ట్రయిల్ కోర్టు ఇచ్చిన సాధారణ బెయిల్ ఆదేశాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తన మధ్యంతర ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. అప్పటి వరకు సీఎం కేజ్రీవాల్‌ను తీహాడ్ జైలులోనే ఉండాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ సతీశ్ కుమార్ జైన్ శుక్రవారం తన ఆదేశాల్లో స్పష్టం చేశారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి అరెస్టయిన సీఎం కేజ్రీవాల్‌కు ట్రయిల్ కోర్టు గురువారం సాధారణ బెయిల్ మంజూరు చేసింది. ట్రయిల్ కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈడీ శుక్రవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ క్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
Also Read: June 21: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా..
మరోవైపు కేజ్రీవాల్ సాధారణ బెయిల్ ఎందుకు నిలుపు వేయాల్లో ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు.. హైకోర్టులో సోదాహరణగా వివరించారు. ఆ క్రమంలో ఈ లిక్కర్ స్కామ్‌లో చోటు చేసుకున్న పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాలన్నీ కేజ్రీవాల్‌కు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయని గుర్తు చేశారు. వీటిని పరిశీలించకుండానే ట్రయిల్ కోర్టు కేజ్రీవాల్‌కు సాధారణ బెయిల్ మంజూరు చేసిందన్నారు.
Also Read: AP Assembly: తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు..
ఇక సీఎం కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌కు ట్రయిల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేయడం.. బెయిల్ రద్దుతో సమానమని అభివర్ణించారు. బెయిల్ మంజూరు చేయడానికి, రద్దు చేయడానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసముందన్నారు. చట్టాన్ని దాట వేయడానికి ప్రయత్నిస్తోందంటూ ఈడీపై అభిషేక్ మను సింఘ్వీ తీవ్ర ఆరోపణలు చేశారు.
Also Read: Delhi Liquor Scam: జులై 7 వరకు కవిత కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ మార్చి 21న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాటి నుంచి ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల వేళ.. తన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం చేసుకోవాడానికి బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో మే 10న కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీతో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. దీంతో జూన్ 2వ తేదీన జైలు అధికారుల ముందు లొంగిపోవాలని కేజ్రీవాల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో జూన్ 2న ఆయన తీహాడ్ జైలు అధికారుల ముందు లొంగిపోయిన విషయం విధితమే.
Read Latest Telangana News and Telugu News
Updated Date - Jun 21 , 2024 | 06:13 PM