ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు ప్రకటించిన కేజ్రీవాల్

ABN, Publish Date - May 12 , 2024 | 05:14 PM

కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Arvind Kejriwal

న్యూఢిల్లీ, మే 12: కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. 10 గ్యారంటీలు అమలు చేస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆదివారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఉచిత కరెంట్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. అలాగే పొరుగు దాయాది దేశం చైనా అక్రమించిన భారత సరిహద్దు ప్రాంతానికి విముక్తి కలిగిస్తామని తెలిపారు. అయితే ఈ 10 గ్యాంరటీలపై ఇండియా కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాలతో తాను చర్చించలేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

Congress Party: ఖర్గే హెలికాఫ్టర్‌లో తనిఖీలు..


ఇండియా కూటమి అధికారంలోకి రాగానే.. ఈ గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఇక తాను జైలు నుంచి విడుదల కావడం ఆలస్యమైందని.. దీంతో పలు దశల పోలింగ్ జరిగి పోయిందని ఈ సందర్బంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. మనీ ల్యాండరింగ్ కేసులో ఈ ఏడాది మార్చి 21వ తేదీన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో నాటి నుంచి ఆయన తీహాడ్ జైల్లోనే ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించారు.

దీంతో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీతో సార్వత్రిక ఎన్నికల చివరి దశ పోలింగ్ ముగియనుంది. ఈ నేపథ్యంలో జూన్ 2వ తేదీన లొంగిపోవాలని.. సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.

Mothers Day: అమ్మ పాత్ర ఎప్పటికీ నిత్య నూతనమే


కేజ్రీవాల్ ప్రకటించిన 10 గ్యారంటీలు...

1)

దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు లేకుండా నిరంతర విద్యుత్ అందిస్తాం. అలాగే 200 యూనిట్ల వరకు ఎలక్ట్రసిటీ బిల్లు ఉచితంగా ఇస్తాం.

2)

ప్రైవేట్ పాఠశాలల్లో కంటే.. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా మరింత మెరుగైన విద్యను అందిస్తాం.

3)

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలతోపాటు సౌకర్యాలను సైతం కల్పిస్తాం.

4)

చైనా ఆధీనంలో ఉన్న భారత భూభాగాన్ని విముక్తి చేస్తాం.. అందుకోసం ఆర్మీకి పూర్తి స్వేచ్చనిస్తాం.

5)

మోదీ ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్ని వీర్ పథకాన్ని రద్దు చేస్తాం.

6)

రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తాం.

7)

ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా తీసుకు వస్తాం.

8)

ప్రతీ ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందిస్తాం.

9)

దేశంలోని అవినీతిని పారద్రోలతాం. భారతదేశాన్ని అవినీతిరహిత దేశంగా మారుస్తాం.

10)

జీఎస్టీని సరళీకరిస్తాం

Read Latest National News And Telugu News

Updated Date - May 12 , 2024 | 05:49 PM

Advertising
Advertising