ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CBI: కేజ్రీవాల్‌‌ మళ్లీ అరెస్ట్.. స్పందించిన సునీత

ABN, Publish Date - Jun 26 , 2024 | 08:30 PM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.

న్యూఢిల్లీ, జూన్ 26: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు. కేజ్రీవాల్ జైలు నుంచి విడుదలవ్వకుండా ఈ మొత్తం వ్యవస్థ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇది నియంతృత్వ పాలన, ఎమర్జెన్సీ పరిస్థితులను తలపించే విధంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read: Viral Video: లోక్‌సభ స్పీకర్ ఎన్నికల వేళ.. కలిసిన కంగనా రనౌత్, చిరాగ్ పాశ్వాన్


ఈ కేసులో జూన్ 20వ తేదీన తన భర్తకు ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసిందన్నారు. అయితే ఆయనకు బెయిల్ ఇవ్వకూడదంటూ ఢిల్లీ హైకోర్టును ఈడీ వెంటనే ఆశ్రయించిందని తెలిపారు. ఆ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే విధించిందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఆ వెంటనే ఈ కేసులో నిందితుడంటూ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిందని పేర్కొన్నారు. ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కాకుండా ఈ మొత్తం వ్యవస్థ అడ్డుకుంటుందని సునీత కేజ్రీవాల్ మండిపడ్డారు.

Also Read: AP Politics: మాజీ సీఎం వైఎస్ జగన్‌కు రామచంద్రయ్య చురకలు


ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ని ఓ దొంగ కేసులో సీబీఐ అరెస్ట్ చేసేందుకు ఓ పద్దతి ప్రకారం బీజేపీ వ్యవహరించిందని ఆమ్ ఆద్మీ పార్టీ బుధవారం ఆరోపించింది. జూన్ 20వ తేదీన తమ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిన నాటి నుంచి.. నేటి వరకు చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఈ సందర్బంగా వివరించింది. అంతేకాదు క్రూరత్వం తాలుక అన్ని పరిమితులను నియంత అధిగమించారంటూ ప్రధాని మోదీపై పరోక్షంగా విమర్శించింది. అలాగే కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంతో.. బీజేపీ ఓ విధమైన ఆందోళనకు గురైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓ దొంగ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది.

Also Read: Pakistan: పాక్‌లో అనుమానాస్పద మరణాలు.. కరాచీలో హై అలర్ట్


మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఇదే అంశంపై స్పందించారు. ఇంతకంటే పెద్ద ఎమర్జెన్సీ ఉండదన్నారు. కేజ్రీవాల్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ ఏడాది జనవరిలో మాగుంట రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చారన్నారు. కానీ జూన్‌లో సీబీఐ రంగంలోకి దిగి.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ ఆడుతున్న డర్టీ గేమ్‌ ఇదని ఆయన అభివర్ణించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అని.. ఆయనేమీ తీవ్రవాది కాదని ఈ సందర్బంగా ఎంపీ సంజయ్ సింగ్ స్పష్టం చేశారు.

Also Read: Viral Video: కవితా మజాకా? ఓ చేతిలో పిల్లోడు.. మరో చేతిలో..?

Also Read: Hyderabad: పలు ప్రాంతాల్లో నేడు, రేపు నీటి సరఫరాకు అంతరాయం

For More National News and Latest Telugu News click here

Updated Date - Jun 26 , 2024 | 08:42 PM

Advertising
Advertising