LokSabha Elections: మోదీ రిటైర్ అవుతున్నారు.. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు..?
ABN, Publish Date - May 11 , 2024 | 02:35 PM
తీహడ్ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడికి దిగారు. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీ నేతలను ఆయన డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, మే 11: తీహడ్ జైలు నుంచి మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ లక్ష్యంగా చేసుకొని విమర్శల దాడికి దిగారు. మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీ నేతలను ఆయన డిమాండ్ చేశారు.
శనివారం న్యూడిల్లీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. 2025, సెప్టెంబర్ 17వ తేదీతో ప్రధాని మోదీ 75 వసంతంలోకి అడుగు పెడుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో 75 ఏళ్లు వచ్చిన నాయకులు రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ బీజేపీలో ఓ నియమం ఉందని ఈ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ గుర్తు చేశారు.
Elections: ప్రయాణికులతో నిండిపోయిన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు
ఈ నియమం ప్రకారం వచ్చే ఏడాది సెప్టెంబర్ 17వ తేదీతో మోదీ రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నారని చెప్పారు. దీంతో మీ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీ నేతలకు కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
మరోవైపు మీ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ.. ఇండియా కూటమి నేతలను బీజేపీ నాయకులు పదే పదే ప్రశ్నిస్తున్నారని ఈ సందర్భంగా కేజ్రీవాల్ గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ముందు మీ ప్రధాన మంత్రి అభ్యర్థి పేరు ప్రకటించాలని బీజేపీ నేతలకు అరవింద్ కేజ్రీవాల్ సూచించారు.
మార్చి 21న డిల్లీ మద్యం కుంభకోణంలో మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ని తీహాడ్ జైలుకు తరలించారు. నాటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. అయితే సార్వత్రిక ఎన్నికల వేళ తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
LokSabha Elections: తనయుడి భవిష్యత్తుపై స్పందించిన మేనకా గాంధీ
దీంతో మే 10వ తేదీన అరవింద్ కేజ్రీవాల్‌కు కండిషన్లతో కూడిన మద్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మంజురు చేసింది. దాంతో ఆయన శుక్రవారం తీహాడ్ జైలు నుంచి విడుదలయ్యారు. శనివారం ఉదయం ఢిల్లీలో ఆప్ అభ్యర్థులకు మద్దతుగా కేజ్రీవాల్ తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారంలో ప్రధాన మంత్రి అభ్యర్థి ప్రకటించాలని బీజేపీ నేతలకు కేజ్రీవాల్ సవాల్ విసిరారు.
Read Latest National News And Telugu News
Updated Date - May 11 , 2024 | 02:38 PM