Viral News: ట్రైన్లలో దుప్పట్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారు..
ABN, Publish Date - Nov 28 , 2024 | 07:47 AM
రైళ్లలో అందించే దుప్పట్లు, దిండ్లను నెలకు ఎన్నిసార్లు ఉతుకుతారనే ప్రశ్న అనేక మందికి ఎదురవుతుంది. అయితే ఇదే ప్రశ్నను పార్లమెంటులో రైల్వే మంత్రిని ఓ ఎంపీ తాజాగా అడిగారు. అందుకు మంత్రి ఏం సమాధానం చెప్పారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ట్రైన్లలో అనేక మంది ప్రతిసారి రిజర్వేషన్ టిక్కెట్లు బుక్ చేసుకుని రోజుల కొద్ది ప్రయాణం చేస్తుంటారు. ఆ క్రమంలో వారికి రైళ్లలో పలు రకాల సౌకర్యాలు కల్పిస్తారు. వాటిలో దుప్పట్లను అందించడం కూడా ఒకటి. అయితే ఈ దుప్పట్లను నెలకు ఎన్ని సార్లు ఉతుకుతారనే ప్రశ్నను ఇటివల పార్లమెంట్‌లో ఓ ఎంపీ రైల్వే మంత్రిని అడిగారు. అందుకు మంత్రి ఏం చెప్పారనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. రైళ్లలో ప్రయాణికులకు ఇచ్చే దుప్పట్లను భారతీయ రైల్వే కనీసం నెలకు ఒకసారైనా ఉతుకుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnav) అన్నారు. బెడ్‌రోల్ కిట్‌లో మెత్తని కవర్‌గా ఉపయోగించేందుకు అదనపు షీట్‌ను కూడా అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రయాణీకుల కోసం
పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా పరుపుల కోసం ప్రయాణీకులు చెల్లిస్తుండగా, రైల్వే నెలకు ఒకసారి మాత్రమే ఉన్ని దుప్పట్లను ఉతుకుతుందా అని కాంగ్రెస్ ఎంపీ కుల్దీప్ ఇండోరా అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ సమాచారం ఇచ్చారు. భారతీయ రైల్వేలో ఉపయోగించే దుప్పట్లు తేలికగా, సులభంగా ఉతకవచ్చని రైల్వే మంత్రి తెలిపారు. రైళ్లలో ప్రయాణీకుల సౌకర్యం, భద్రతను నిర్ధారించడానికి తీసుకున్న ఇతర చర్యల గురించి కూడా ఆయన తెలియజేశారు.
తనిఖీ చేయడానికి
మంచి నాణ్యతను నిర్ధారించడానికి BIS ధృవీకరణతో కూడిన కొత్త నార సెట్ల సేకరణ, శుభ్రమైన నార సెట్ల సరఫరాను నిర్ధారించడానికి మెకనైజ్డ్ లాండ్రీలు, ప్రామాణిక యంత్రాలు, వాషింగ్ కోసం రసాయనాల వినియోగం మొదలైనవి ఉంటాయని స్పష్టం చేశారు. అంతేకాదు ఉతికిన నార వస్తువుల నాణ్యతను తనిఖీ చేయడానికి వైటో మీటర్‌ని ఉపయోగిస్తారని వైష్ణవ్ తెలిపారు. రైల్‌మదాద్ పోర్టల్‌లో నమోదైన ఫిర్యాదులను పర్యవేక్షించేందుకు రైల్వే జోనల్ హెడ్‌క్వార్టర్స్, డివిజనల్ స్థాయిలో 'వార్ రూమ్'లను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. దీని ప్రకారం ఎలాంటి ఫిర్యాదులైనా కూడా తక్షణమే వాటిపై చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు.
కామెంట్లు
అయితే ట్రన్లలో ప్రయాణించే అనేక మందికి ఇలాంటి ప్రశ్నలు తరచుగా ఎదురవుతాయని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇదే అంశంపై పార్లమెంటులో ప్రశ్నించడం హాట్ టాపిక్‌గా మారింది. అంతేకాదు దీనికి రైల్వే మంత్రి వివరంగా సమాధానం చెప్పడం కూడా అనేక మందిని ఆకర్షించింది. ఈ సమాధానం చూసిన అనేక మంది పలు రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది బెజ్ షీట్లను నెలకు ఒక్కసారైనా ఉతుకుతున్నారని అంటుండగా, మరికొంత మంది మాత్రం నెలకు రెండు సార్లు వాష్ చేయాలని కోరుతున్నారు. ఇంట్లో మాదిరిగా నెలకు ఓసారి ఉతికితే చాలని ఇంకొంత మంది కామెంట్లు చేయడం విశేషం.
ఇవి కూడా చదవండి:
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
SBI ATMs: ఏటీఎంలలో సాంకేతిక సమస్యతో లక్షల రూపాయలు లూటీ.. అలర్ట్ చేసిన బ్యాంక్
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 28 , 2024 | 10:54 AM