ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Assam Police: ఐసీయూలో గన్ సౌండ్.. ఏం జరిగిందంటే..?

ABN, Publish Date - Jun 19 , 2024 | 09:06 AM

సిలాదిత్య చెటియా 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అసోం హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. భార్యకు క్యాన్సర్ రావడంతో గత నాలుగు నెలల నుంచి సెలవులో ఉన్నారు. గువహటిలో గల నెమ్ కేర్ ఆస్పత్రిలో భార్యకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది.

Assam Top Official

ఏబీఎన్ ఇంటర్నెట్: ఆ దంపతులు ఒకరిని విడిచి మరొకరు ఉండలేరు. జీవితం సాఫిగా సాగుతోంది. భర్త ప్రొఫెషనల్‌గా మంచి పొజిషన్‌లో ఉన్నారు. భార్యకు సమయం కేటాయించేవారు. అంతా బాగుందని అనుకునే లోపు షాకింగ్ న్యూస్ తెలిసింది. భార్యకు క్యాన్సర్ వచ్చిందని తెలిసింది. ఫస్ట్ స్టేజ్ అయితే ట్రీట్‌మెంట్‌తో నయం అయ్యేది. ఫోర్త్ స్టేజ్ కావడం.. ఆస్పత్రి పాలు కావడంతో ఆ భర్త కృంగిపోయాడు.


ఏమైందంటే..

సిలాదిత్య చెటియా 2009 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం అసోం హోం సెక్రటరీగా పనిచేస్తున్నారు. భార్యకు క్యాన్సర్ రావడంతో గత నాలుగు నెలల నుంచి సెలవులో ఉన్నారు. గువహటిలో గల నెమ్ కేర్ ఆస్పత్రిలో భార్యకు చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి దిగజారింది. క్యాన్సర్‌తో పోరాడలేక చనిపోయింది. అక్కడే ఉన్న సిలాదిత్యకు వైద్యులు విషయం చెప్పారు. బెడ్ మీద భార్యను చూసి సిలాదిత్య తల్లడిల్లి పోయాడు.


తట్టుకోలేక..

భార్యను అచేతనంగా చూసి సిలాదిత్య తట్టుకోలేక పోయాడు. నువ్వేలేక నేనుండలేను అని భావించాడు. ఐసీయూ గదిలో ఉన్న వైద్య సిబ్బందిని బయటకు పంపించారు. అంజలి ఘటిస్తున్నానని చెప్పడంతో వెళ్లారు. అంతలోనే తన వద్ద ఉన్న సర్వీస్ రివాల్వర్ తీసుకొని పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకున్నాడు. గన్ సౌండ్ విని వెంటనే గదిలోకి వచ్చారు. అక్కడ సిలాదిత్య రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే వైద్యం అందజేసిన నో యూజ్. అతను అప్పటికే చనిపోయాడు.


ప్రొఫెషనల్ లైఫ్

టిన్‌సూకియా, సోనిట్ పూర్ జిల్లా ఎస్పీగా సిలాదిత్య పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారు. అసోం పోలీస్ 4వ బెటాలియన్ కమాండెంట్‌గా విధులు నిర్వహించారు. తర్వాత అసోం హోం సెక్రటరీగా బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. భార్య మృతి తట్టుకోలేక ఈ లోకాన్ని వదిలి వెళ్లారు.

Updated Date - Jun 19 , 2024 | 09:06 AM

Advertising
Advertising