Assembly Polls: హరియాణా, జమ్మూ కశ్మీర్‌లో ప్రారంభమైన కౌంటింగ్
ABN, Publish Date - Oct 08 , 2024 | 08:05 AM
హరియాణా, జమ్మూ కాశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 11 గంటల వరకు ఇరు రాష్ట్రాల్లో ట్రెండ్ తెలిసిపోయే అవకాశం ఉంది.
ఢిల్లీ: హరియాణా, జమ్మూ కాశ్మీర్‌లలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఉదయం 11 గంటల వరకు ఇరు రాష్ట్రాల్లో ట్రెండ్ తెలిసిపోయే అవకాశం ఉంది. దీంతో అందరి దృష్టి ఫలితాలపై ఎన్నికలపైనే ఉంది. భారత ఎన్నికల సంఘం హర్యానాలో 93 కౌంటింగ్ కేంద్రాలను, జమ్మూ కాశ్మీర్‌లో 28 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. హర్యానాలోని 90 స్థానాలకు అక్టోబర్ 5న ఒకే దశలో 68 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూ కాశ్మీర్‌లో మూడు దశల్లో - సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీలలో 90 స్థానాలకు 63.88 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక్కడ లోక్‌సభ ఎన్నికల్లో 58.58 శాతం పోలింగ్ నమోదైంది.
2014, 2019లో హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయం సాధించింది. ఆమ పార్టీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో దశాబ్ద కాలం పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ఉవ్విల్లూరుతోంది. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ), ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్‌డీ) కూడా బరిలో నిలిచాయి. హరియాణాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. జమ్మూ కాశ్మీర్‌లో హంగ్ ఏర్పడవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.
Updated Date - Oct 08 , 2024 | 08:05 AM