ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Results: తల్లి రికార్డును బ్రేక్ చేసిన తనయుడు

ABN, Publish Date - Jun 04 , 2024 | 04:22 PM

ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ గత రికార్డులను బద్ధలుకొట్టడం ఖాయమైంది. మధ్యాహ్నం 3.15 గంటలకు ఈసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

రాయబరేలి: ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి (Rae Bareli) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత రికార్డులను బద్ధలుకొట్టడం ఖాయమైంది. మధ్యాహ్నం 3.15 గంటలకు ఈసీ విడుదల చేసిన సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ తన సమీప బీజేపీ ప్రత్యర్థిపై 3 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.


రాయబరేలి నియోజకవర్గానికి 2004 నుంచి సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019లో ఇక్కడి నుంచి 1.67 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అయితే ఈసారి లోక్‌సభ ఎన్నికల దూరంగా ఉంటున్నట్టు ప్రకటిస్తూ ఆమె రాజ్యసభకు వెళ్లారు. దీంతో రాయబరేలి నుంచి రాహుల్ ఎన్నికల బరిలోకి దిగారు. తన కుమారుడిని రాయబరేలి ప్రజలకు అప్పగిస్తున్నానని, తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా ఆశీర్వదించాలని ఇటీవల రాయబరేలిలో జరిగిన ర్యాలీలో సోనియాంగాధీ ప్రజలకు అప్పీల్ చేశారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం నిరాశపరచని భరోసా ఇచ్చారు. రాహుల్ గాంధీ ఈసారి కూడా తన సిట్టింగ్ నియోజకవర్గమైన కేరళలోని వయనాడ్‌తో పాటు రాయబరేలిలోనూ పోటీలో ఉన్నారు. మరోవైపు, వయనాడ్‌లోనూ రాహుల్ తన సమీప సీపీఎం అభ్యర్థి అన్నే రాజాపై 3 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

Updated Date - Jun 04 , 2024 | 04:22 PM

Advertising
Advertising