August 15 Flag Row: ఆగస్టు 15 జెండా వివాదమే కేజ్రీవాల్, గెహ్లాట్ మధ్య చిచ్చుకు కారణం
ABN, Publish Date - Nov 17 , 2024 | 05:09 PM
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నేత, ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ (Kailash Gahlot) ఆ పార్టీకి, మంత్రి పదవికి ఆదివారంనాడు రాజీనామా చేయడం కీలక రాజకీయ పరిణామంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేజ్రీవాల్, గెహ్లాట్ మధ్య విభేదాలకు ఎక్కడ ఆజ్యం పడిందనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. గత ఆగస్టు 15వ తేదీన ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వాతంత్ర్య వేడుకల సమయంలో జెండా ఎగురవేసే విషయంలో ఈ వివాదానికి బీజం పడినట్టు చెబుతున్నారు.
Kailash Gahlot: 'ఆప్'కు గట్టిదెబ్బ.. మంత్రి రాజీనామా
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు. అయితే, ఈ విషయంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా జోక్యం చేసుకున్నారు. కేజ్రీవాల్ ఇచ్చిన ఆదేశం చెల్లదని, ఆమెకు బదులుగా ఢిల్లీ హోం మంత్రి కైలాష్ గెహ్లాట్ జెండా ఎగురవేయాలని ఆదేశించారు. సెరిమోనియల్ మార్చ్-ఫాస్ట్ నిర్వహించే ఢిల్లీ పోలీసులు హోం శాఖ అధీనంలో ఉండటంతో హోం శాఖ సైతం ఎల్జీ ఆదేశాలను సమర్ధించింది. దీంతో ఆప్ సారథ్యంలోని ఢిల్లీ ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయానికి మధ్య తీవ్రమైన మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఎల్జీ దిగదారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆప్ ఆరోపించింది. ఎల్జీ నియంతృత్వానికి ఇది నిదర్శనమని అతిషి తప్పుపుట్టారు. అయితే ఎల్జీ ఆదేశాలకు గెహ్లాట్ సుముఖత తెలపడంతో అప్పటి నుంచి ఆయనకు కేజ్రీవాల్‌తోనూ, పార్టీతోనూ సంబంధాలు క్షీణించినట్టు చెబుతున్నారు.
న్యాయశాఖ అతిషికి బదిలీ
గత ఏడాది డిసెంబర్‌లో గెహ్లాట్ చేతిలోని న్యాయశాఖను అతిషి తన చేతిలోకి తీసుకున్నారు. న్యాయశాఖకు సంబంధించిన చాలా పని పెండింగ్‌లో ఉన్నందునే ఆ శాఖను అతిషి తన అధీనంలోకి తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
విమర్శలు గుప్పించుకున్న బీజేపీ, ఆప్
కాగా, కేజ్రీవాల్‌కు గెహ్లాట్ రాసిన లేఖలో ఆప్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని, అనేక వివాదాలు ప్రభుత్వాన్ని చుట్టుముట్టాయని, యుమానా నదీ ప్రక్షాళనకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, శీష మహల్ వివాదం, కేంద్రంతో ఘర్షణలు వంటి అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. గత్యంతరం లేకనే ఆప్‌కు రాజీనామా చేశానన్నారు. దీనిపై ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు సచ్‌దేవ్ స్పందించారు. ఆప్ ప్రభుత్వం విఫలమైందని, నిజాయితీ లోపంచిందని తామేదైతే చెప్పామో అదే గెహ్లాట్ రాజీనామాతో స్పష్టమైందన్నారు. కాగా, గెహ్లాట్ రాజీనామాపై బీజేపీ ఆరోపణలను ఆప్ గట్టిగా తిప్పికొట్టింది. బీజేపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శమని మండిపడింది. గెహ్లాట్‌పై ఈడీ, సీబీఐలను ఉసిగొలిపి ఒత్తిడి చేసిందని, ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ బీజేపీ 'వాషింగ్ మిషన్'ను యాక్టివ్ చేసిందని విమర్శలు గుప్పించింది.
ఇవి కూడా చదవండి:
Air Pollution: రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..
Viral Video: మోదీ నినాదాలు, డప్పుల చప్పుళ్లు.. నైజీరియాలో ప్రధానికి ఘన స్వాగతం
Read More National News and Latest Telugu News
Updated Date - Nov 17 , 2024 | 05:12 PM