ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Delhi : పిల్లలు సోషల్‌ మీడియా వాడకుండా నిషేధం

ABN, Publish Date - Sep 11 , 2024 | 05:38 AM

చిన్నపిల్లలు సోషల్‌ మీడియా వాడకుండా పూర్తిగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్‌ స్వయంగా వెల్లడించారు.

  • చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న ఆస్ట్రేలియా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 10: చిన్నపిల్లలు సోషల్‌ మీడియా వాడకుండా పూర్తిగా నిషేధం విధించాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా చట్టాన్ని తీసుకురానున్నట్లు ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్‌ స్వయంగా వెల్లడించారు. సోషల్‌ మీడియా పిల్లల మానసిక ఆరోగ్యంతో పాటు శారీరకంగానూ దెబ్బతీస్తోందని ఆయన అన్నారు. ‘‘పిల్లలు ఫోన్లను వదిలేసి మైదానాల్లో, ఈత కొలనుల్లో, టెన్నిస్‌ కోర్టుల్లో ఆడుకోవడం చూడాలని ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. తొలుత సోషల్‌ మీడియా ఖాతాల్లో వయసు ధ్రువీకరణ ఆప్షన్‌ను ప్రయోగాత్మకంగా అమలు చేసి, ఆ తర్వాత ఈ ఏడాది చివరికల్లా చట్టాన్ని తీసుకువస్తామని ఆయన చెప్పారు. అయితే, ఎంతలోపు వయస్సువారు సోషల్‌ మీడియా వాడకుండా నిషేధం ఉంటుందనేది ఆయన స్పష్టంగా వెల్లడించారు. 14 ఏళ్లు లేదా 16ఏళ్ల లోపు పిల్లలపై నిషేధం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఆలోచనను డిజిటల్‌ హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. ఒక వేళ అలా చట్టం తీసుకువస్తే పిల్లలు ఫోన్లను చాటుగా ఉపయోగిస్తారని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Sep 11 , 2024 | 05:38 AM

Advertising
Advertising