ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ayodhya: ఎస్పీ నేతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘మార్క్ ట్రీట్‌మెంట్’

ABN, Publish Date - Aug 22 , 2024 | 04:49 PM

అయోధ్యలోని సమాజావాదీ పార్టీ నేత మోయిద్ ఖాన్ (65)తోపాటు రాజు ఖాన్‌పై లైంగిక దాడి ఘటనలో పోలీసులు కేసులో నమోదు చేశారు. 12 ఏళ్ల బాలిక కడుపులో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆమె గర్బవతి అని వైద్యులు వెల్లడించారు.

లఖ్‌నవూ, ఆగస్ట్ 22: అయోధ్యలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన సమాజవాదీ పార్టీ నేత, నిందితుడు మోయిద్ ఖాన్ వ్యవహారంలో యోగి ప్రభుత్వం మరింత కఠిన వైఖరిని అవలంభించింది. నిందితుడు మోయిద్ ఖాన్‌కు చెందిన బేకరిని కూల్చివేసిన మరునాడే.. అతడికి చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని కొంత భాగాన్ని సైతం నెలమట్టం చేసింది. ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌లోని కొంత భాగాన్ని గురువారం కూల్చివేసినట్లు ప్రభుత్వాధికారులు వెల్లడించారు.


షాపింగ్ కాంప్లెక్స్ కూల్చివేతకు చర్యలు..

నిందితుడు మోయిద్ ఖాన్.. ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. సదరు కాంప్లెక్స్‌లోని కొంత భాగాన్ని ఈ రోజు కూల్చి వేశామని అధికారులు వివరించారు. మిగిలిన భాగాన్ని సైతం సాధ్యమైనంత త్వరగా కూల్చివేస్తామని తెలిపారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్‌లోని దుకాణాలను ఖాళీ చేయించిన అనంతరం.. కూల్చివేతకు చర్యలు చేపట్టామని వారు వివరించారు.


బాలిక కుటుంబానికి మరింత రక్షణ..

మరోవైపు సమాజవాదీ పార్టీ నేత మోయిద్ ఖాన్ చేతిలో లైంగిక దాడికి గురైన బాలికకు ప్రభుత్వం మరింత రక్షణ పెంచింది. భద్రతలో భాగంగా ఆమె కుటుంబాన్ని బదర్సా పట్టణానికి తరలించింది. లైంగిక దాడి బాధితురాలైన బాలిక.. లఖ్‌నవూలోని కేజీఎంయూలో వైద్య సహాయం తీసుకుంటుంది. ఆ క్రమంలో ఆమె నివసించే ప్రాంతంలో శాంతి భద్రతల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ సీనియర్ అధికారి వివరించారు. ఆ బాలిక నివాసం వద్ద దాదాపు 30 మంది పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశామన్నారు. అందులో మహిళా కానిస్టేబుళ్లు సైతం ఉన్నారని చెప్పారు.


అలా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది..

జులై 29వ తేదీ.. అయోధ్యలోని సమాజావాదీ పార్టీ నేత మోయిద్ ఖాన్ (65)తోపాటు రాజు ఖాన్‌పై లైంగిక దాడి ఘటనలో పోలీసులు కేసులో నమోదు చేశారు. 12 ఏళ్ల బాలిక కడుపులో నొప్పి వస్తుందంటూ కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఆ క్రమంలో ఆమె గర్బవతి అని వైద్యులు వెల్లడించారు. కుమార్తెను తల్లిదండ్రులు నిలదీశారు. దాంతో రెండు నెలల కిత్రం తనపై మోయిద్ ఖాన్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులకు ఆ బాలిక వివరించింది. దాంతో వారు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలా జులై 30న మోయిద్ ఖాన్‌తోపాటు రాజు ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.


ఎన్నికల స్టంట్‌గా మారిన వ్యవహరం...

మరోవైపు ఈ కేసును రాజకీయ పార్టీలు ఎన్నికల స్టంట్‌గా మలుచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. దాంతో ఈ కేసులో నిందితులకు డీఎన్ఏ టెస్ట్ నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఈ ఘటనపై ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం స్పందించారు. రాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్నాయన్నారు. దీంతో అధికార బీజేపీ ఎన్నికల స్టంట్‌గా ఈ సంఘటనను మలుచుకుంటుందని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందజేయాలని ఈ సందర్బంగా ప్రభుత్వాన్ని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు.


బాధితురాలి తల్లితో సీఎం యోగి భేటీ అనంతరం..

ఇంకోవైపు గత శుక్రవారం లక్నోలో బాధితురాలి తల్లిని సీఎం యోగి ఆదిత్యనాథ్ కలిశారు. కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని ఆమెకు ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. అనంతరం అయోధ్యలో మోయిద్ ఖాన్ అక్రమంగా నిర్మించిన బేకరిని ఇప్పటికే కూలగొట్టారు. తాజాగా షాపింగ్ కాంప్లెక్స్‌ను సైతం కూలగొట్టే చర్యలకు యోగి ప్రభుత్వం ఉపక్రమించింది.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 22 , 2024 | 04:51 PM

Advertising
Advertising
<