Ayodhya: సూర్య తిలకానికి సిద్ధమైన సాకేతపురి.. జై శ్రీరామ్ నినాదంతో మార్మోగుతున్న అయోధ్య..
ABN, Publish Date - Apr 17 , 2024 | 11:41 AM
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం.
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. ఆనాడు.. హనుమంతుడికి సీతమ్మ ఇచ్చిన ముత్యాలహారంలో తన రామయ్య జాడ లేదని తిరస్కరించిన ఆ పవనసుతుడే రామభక్తిలో మనందరికీ ఆదర్శం. పట్టాభిషిక్తుడై రాజ్యాన్ని పరిపాలిస్తాడని అంతా భావిస్తున్న తరుణంలో తండ్రి మాటను ధిక్కరించలేక 14 ఏళ్లు అరణ్యవాసం చేసిన ఆ రాఘవుడు.. రాజ్యానికి విచ్చేసిన ఆధ్యాత్మిక సంబురంలో అయోధ్యా ( Ayodhya Ram Mandir ) నగరమే కాదు.. యావత్ భారతావని నాటి స్మృతులతో పరవశిస్తోంది..!!. జనవరిలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం జరిగిన తర్వాత జరుపుకుంటున్న మొదటి శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది. ఐదు శతాబ్దాల నిరీక్షణ ఫలించిన తర్వాత రాముడి జన్మస్థలంలో నిర్మించిన ఆలయంలో ఒక ముఖ్యమైన సందర్భం ఆవిష్కృతం కానుంది.
Hyderabad: ఊపిరాడని ప్రయాణం.. మండే ఎండల్లో కిటకిటలాడుతున్న మెట్రో రైళ్లు
రాంలల్లా నుదుటిపై సూర్య కిరణాలు పడే విధంగా ఆలయ అధికారులు, శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. సరిగ్గా మధ్యాహ్నం 12.16 గంటలకు రామ్ లల్లా నుదిటిపై సూర్య కిరణాలు పడతాయి. ఈ వేడుకతో పాటు చప్పన్ భోగ్ అనే క్రతువునూ నిర్వహిస్తారు. 56 రుచికరమైన వంటకాలను స్వామివారికి నివేదిస్తారు. రామనవమి వేడుకలను ఘనంగా, ఉత్సాహంగా జరుపుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు రామజన్మభూమి ఆలయ ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు.
PM Modi: ఈ శుభ సందర్భంలో నా మనస్సు భావోద్వేగంతో నిండిపోయింది.. ప్రధాని మోదీ
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర నిర్వాహకులు అయోధ్య రాముని దర్శన సమయాన్ని పొడిగించారు. రాత్రి 11 గంటల వరకు భక్తులు స్వామి వారిని దర్శించుకోవచ్చని తెలిపారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించే ముందు మొబైల్ ఫోన్లు, పాదరక్షలు, ఇతర నిషేధిత వస్తువులను కౌంటర్ లో డిపాజిట్ చేయాలని అధికారులు సూచించారు. సుగమ్ దర్శనం, వీఐపీ దర్శనం, మంగళ హారతి, శృంగార్ ఆరతి, శయన ఆరతి వంటి వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.
Updated Date - Apr 17 , 2024 | 11:43 AM