Baba Siddique murder: దసరా బాణసంచా పేలుళ్ల మధ్య సిద్ధిఖిపై కాల్పులు
ABN, Publish Date - Oct 13 , 2024 | 02:52 PM
ముంబై: ఎన్‌సీపీ (NCP) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి (Baba Siddique) హత్య పక్కా ప్లానింగ్‌తోనే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాంట్రాక్ట్ హత్య కావచ్చునా, వ్యాపారంలో శత్రుత్వమే కారణమా, స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కారణంగానే ఆయనను హంతకులు మట్టుబెట్టారా అనే పలు కోణాల నుంచి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
ముంబై: ఎన్‌సీపీ (NCP) నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖి (Baba Siddique) హత్య పక్కా ప్లానింగ్‌తోనే జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కాంట్రాక్ట్ హత్య కావచ్చునా, వ్యాపారంలో శత్రుత్వమే కారణమా, స్లమ్ రిహాబిలిటేషన్ ప్రాజెక్టు కారణంగానే ఆయనను హంతకులు మట్టుబెట్టారా అనే పలు కోణాల నుంచి ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. హత్యకు పాల్పడిన వారుగా అనుమానిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేయగా, మరో నిందితుడు పరారీలో ఉండటంతో అతని కోసం గాలిస్తున్నారు.
Baba Siddique: అందుకే బాబా సిద్ధిఖీని హత్య చేశారా?
పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరిలో ఒకరిని హర్యానాకు చెందిన గుర్మైల్ బల్జిత్ సింగ్ (23)గా, మరొకరిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధర్మరాజ్ రాజేష్ కష్యప్ (19)గా గుర్తించారు. బాబా సిద్ధిఖిని చంపేందుకు హంతకులకు అడ్వాన్స్‌గానే పేమెంట్ చెల్లించారని, ఆయుధాలను కొద్దిరోజులకు ముందుగానే వారికి సరఫరా చేశారని చెబుతున్నారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్)లోని పలు సెక్షన్లతో పాటు, ఆయుధాల చట్టం, మహారాష్ట్ర పోలీస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ముంబై బాంద్రా నివాసం వెలుపల తన కుమారుడు, ఎమ్మెల్యే అయిన జీషన్ సిద్ధిఖి కార్యాలయం వెలుపల బాబా సిద్ధిఖిపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను బాంద్రాలోని లీలావతి ఆసుపత్రి తరలిస్తుండగానే కన్నుమాశారు.
నాలుగైదు రౌండ్లు కాల్పులు
సిద్ధిఖిపై షూటర్లు 9.9 ఎంఎం పిస్తోలుతో నాలుగైదు రౌండ్లు కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. దసరా విసర్జన్ ఊరేగింపు సందర్భంగా బాణసంచా కాలుస్తుండగా ఆ పేలుడు మోతలో కలిసిపోయేలా సిద్ధిఖిపై దుండగులు కాల్పులు జరిపినట్టు తెలిపారు.
Read More National News and Latest Telugu News
Maharashtra: మాజీ మంత్రి బాబా సిద్దిఖీ దారుణ హత్య.. స్పందించిన రాహుల్ గాంధీ
Updated Date - Oct 13 , 2024 | 02:52 PM