ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bangalore : దివ్యాంగులను సమానత్వంతో చూడాలి : సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

ABN, Publish Date - Jul 28 , 2024 | 04:20 AM

దివ్యాంగులను సమానత్వంతో చూసేలా సమాజంలోమార్పు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు.

బెంగళూరు, జూలై 27(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులను సమానత్వంతో చూసేలా సమాజంలోమార్పు రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ అన్నారు. ఈ అంశంపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినా అవి అమలు కావడం ముఖ్యమని అన్నారు. బెంగళూరులో రాష్ట్ర ప్రభుత్వం, రామయ్య లా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఫంక్షన్‌ ఆఫ్‌ ఇండియా యాక్సెస్‌ ఎబిలిటీ సమ్మిట్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తాను ఒక న్యాయమూర్తిగా కాకుండా దివ్యాంగ బాలికల తండ్రిగా ఈ కార్యక్రమానికి వచ్చానని అన్నారు. దివ్యాంగుల బాధలు, సవాళ్లు తనకు బాగా తెలుసు అని పేర్కొన్నారు. ప్రజలు దివ్యాంగులను చూసే దృష్టి మారాలని అన్నారు. వారు ఏదైనా సాధించేలా అవకాశాలను మనం కల్పించాలని అన్నారు. తాను తన కుమార్తెలతో ఎంతో నేర్చుకున్నానని అన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీవీ నాగరత్న మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

దివ్యాంగుల విజయగాథలను సినిమాలలో చూపి వారిలో చైతన్యం తీసుకొస్తున్నారని, ఆ ప్రక్రియ కొనసాగాలని అన్నారు. చట్టాలు కూడా వారికి అనుకూలంగా పనిచేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ అంజారియా మాట్లాడుతూ, తమ పరిధిలో 800 మంది దివ్యాంగులు పని చేస్తున్నారని, వారికి పని చేసే విధానంలో శిక్షణలు ఇచ్చామని, సమాన అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

Updated Date - Jul 28 , 2024 | 04:20 AM

Advertising
Advertising
<