Bangalore: అంత్యక్రియలకూ తప్పని తిప్పలు...
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:06 PM
ఆ గ్రామంలో ఎవరైనా మృతిచెందితే... అంత్యక్రియల కోసం వాగు దాటాల్సిందే. జి.నాగలాపురం(G. Nagalapuram) గ్రామ ప్రజల కష్టాలు ఈ నాటివి కావు.. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా వారి సమస్యలను పరిష్కరించిన నాథుడు లేడు. గ్రామ శివారులో శ్మశాన వాటిక ఉండడంతో వర్షాకాలంలో వారి కష్టాలు మరింత దయనీయంగా మారుతున్నాయి.
- శ్మశానానికి వెళ్లాలంటే వాగు దాటాల్సిందే..
- ఎన్నేళ్లయినా పరిష్కారం కాని సమస్య
బళ్లారి(బెంగళూరు): ఆ గ్రామంలో ఎవరైనా మృతిచెందితే... అంత్యక్రియల కోసం వాగు దాటాల్సిందే. జి.నాగలాపురం(G. Nagalapuram) గ్రామ ప్రజల కష్టాలు ఈ నాటివి కావు.. ఎన్నో ఏళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా వారి సమస్యలను పరిష్కరించిన నాథుడు లేడు. గ్రామ శివారులో శ్మశాన వాటిక ఉండడంతో వర్షాకాలంలో వారి కష్టాలు మరింత దయనీయంగా మారుతున్నాయి. గ్రామంలో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించాలంటే నడుములోతు వాగులో శవాన్ని ఎత్తుకుని వెళ్ళాల్సి ఉంటుందని గ్రామ ప్రజలు వాపోతున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Bangalore: కేఆర్‌ఎస్ బ్యాక్‌వాటర్‌లో ‘సీ ప్లేన్’ సంచారం
ఏళ్ళతరబడి ఇదే సమస్యను ఎదుర్కొంటున్నామని, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పట్టించుకునే వారు లేరని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో వాగు ఉదృతంగా ప్రవహిస్తుంటుందని, ఆ సమయంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే వాగులో నీటి ఉదృతి తగ్గేంత వరకు శవసంస్కారాలు ఆపుకోవాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల గ్రామానికి చెందిన జి.చెన్నబసప్ప(62) మృతి చెందారు. వాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రెండు రోజుల పాటు మృతదేహాన్ని ఇంటివద్దనే ఉంచుకుని, విధిలేని సమయంలో రెండురోజుల తర్వాత నడుము లోతు వాగులో మృతదేహాన్ని భుజాలపై ఎత్తుకుని శ్మశానానికి తరలించారు.
భయంతోనే వాగుదాటి శవ సంస్కారాలు నిర్వహించినట్లు గ్రామ పంచాయతీ సభ్యులు గురికార సతీష్(Satish) తెలిపారు. ఆరు వేలమంది జనసంఖ్య కలిగిన గ్రామంలో లింగాయత సమజానికి చెందిన ప్రత్యేక శ్మశానం ఉందని, ఇతర సముదాయాలకు చెందిన వారు ఎవరైనా మృతి చెందితే వాగు అవతలివైపు ఉన్న స్థలంలో అంత్యక్రియలు నిర్వహించాల్సిందేనన్నారు. కేవలం ఎన్నికల సమయం లో మాత్రమే వంతెన నిర్మాణానికి హామీ ఇస్తారని, ఆ తర్వాత పట్టించుకునే నాథుడే లేడని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: మినరల్ కాదు.. జనరల్ వాటరే
ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్ అంటూ మోసం: హరీశ్‌రావు
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్, హరీశ్ ఇళ్ల ముందు ధర్నా చేయండి
ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు
Read Latest Telangana News and National News
Updated Date - Nov 05 , 2024 | 03:06 PM