ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

PM Modi: పేపర్ లీకేజీ నిందితులను వదిలిపెట్టం: ప్రధాని మోదీ

ABN, Publish Date - Jul 02 , 2024 | 06:37 PM

నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీనిచ్చారు.

pm modi

ఢిల్లీ: నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ఆయన మాట్లాడారు. ఆ క్రమంలో పేపర్ లీకేజీ అంశంపై విచారం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీకి కారణమైన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని విద్యార్థులకు హామీనిచ్చారు.


నీట్ అక్రమాలపై విచారణ జరపాలని విద్యాశాఖ కోరడంతో సీబీఐ రంగంలోకి దిగింది. నీట్ పరీక్షకు సంబంధించి బీహార్ సహా రాజస్థాన్, గుజరాత్‌లో సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. జార్ఖండ్ హజారిబాగ్ ఓయాసిస్ స్కూల్‌‌లో అక్రమాలకు పాల్పడ్డారని గుర్తించారు. తప్పు చేసిన ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేశారు. గుజరాత్ గోధారా స్కూల్‌కు చెందిన ఓనర్ జే జలరాం, జర్నలిస్ట్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరీక్షలో సాయం చేస్తామని జలరాం స్కూల్ ఓనర్ అభ్యర్థుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేశారని సీబీఐ అధికారులు వివరించారు. నీట్ పరీక్షలో తన కుమారుడు పాస్ అయ్యేందుకు ప్రయాగ్ రాజ్‌‌ నైనికి చెందిన డాక్టర్ రూ.4 లక్షలు ఇచ్చారని సీబీఐ అధికారులు గుర్తించారు. కుమారుడితో సహా వైద్యుడు పరారీలో ఉన్నారు.


Read Latest
National News and Telugu News

Updated Date - Jul 02 , 2024 | 06:37 PM

Advertising
Advertising