Kolkata : ట్రాములకు టాటా
ABN, Publish Date - Sep 25 , 2024 | 03:00 AM
కోల్‌కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రాము’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది.
సేవలను నిలిపివేయాలని నిర్ణయించిన బెంగాల్ సర్కారు
కోల్‌కతా, సెప్టెంబరు 24: కోల్‌కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రాము’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా వాహనాలతో పోలిస్తే ట్రాములు నెమ్మదిగా నడవడంతో రోడ్లపై రద్దీ పెరుగుతోందని, ప్రజలు వేగవంతమైన రవాణా సదుపాయాలు కోరుకుంటున్న ఈ సమయంలో వాటిని ఇంకా కొనసాగించడం సరికాదని, అందుకే ఆ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించామని బెంగాల్ రవాణా మంత్రి స్నేహాశీస్ వెల్లడించారు. అయితే, మైదాన్-ఎ్‌సప్లనేడ్ మార్గంలో మాత్రం ట్రాము సేవలు కొనసాగుతాయమన్నారు.
ప్రస్తుతం దేశంలో కేవలం ఒక్క కోల్‌కతాలోనే ట్రాములు నడుస్తున్నాయి. బ్రిటిష్ హయాంలో 1873లో ఇక్కడ మొదట గుర్రాలతో నడిచే ట్రాములు ప్రారంభమయ్యాయి. తర్వాత ఇంజన్లు వచ్చాయి. అయితే, ట్రాము సర్వీసులను నిలిపివేయాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించడానికి ట్రాము ప్రేమికులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు, ట్రాముల నిర్వహణపై కలకత్తా హైకోర్టులో పిల్ పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో వీటిని నడిపే అవకాశాలను పరిశీలించాలని హైకోర్టు ఇటీవల రాష్ట్రప్రభుత్వానికి సూచించింది.
Updated Date - Sep 25 , 2024 | 03:01 AM