ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Water Crisis: తీవ్ర నీటి సంక్షోభం.. ఈ పనులకు తాగు నీరు వినియోగిస్తే రూ.5 వేలు జరిమానా

ABN, Publish Date - Mar 08 , 2024 | 11:22 AM

బెంగళూరులో తాగు నీటి సంక్షోభం మరింత పెరిగింది. ఈ కారణంగా పలు స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు ఆన్‌లైన్ విధానంలో విద్యార్థులకు క్లాసులను నిర్వహిస్తున్నారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ సిటి బెంగళూరు(Bengaluru)లో నీటి సంక్షోభం(Water Crisis) మరింత తీవ్రమైంది. దీంతో ఈ సమస్యను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బెంగళూరులో కార్ వాషింగ్(car wash), గార్డెనింగ్, నిర్మాణం, వాటర్ ఫౌంటైన్లు, రోడ్ల నిర్మాణం వంటి పనులకు తాగునీటిని ఉపయోగించడాన్ని నిషేధించింది(ban). ఒక వేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రూ. 5,000 జరిమానా విధించబడుతుందని కర్ణాటక నీటి సరఫరా, మురుగునీటి బోర్డు (KWSSB) ప్రకటించింది.

నగరంలో వేలాది బోర్‌వెల్‌లు ఎండిపోవడంతోనే నీటి ఎద్దడి ఏర్పడిందని పలువురు అంటున్నారు. 2023లో వర్షాభావ పరిస్థితుల కారణంగా కర్ణాటక(karnataka)లోని బెంగళూరు ఇటీవలి సంవత్సరాలలో అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే బెంగళూరు కుమారకృపా రోడ్‌లోని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(siddaramaiah) నివాసం ఉన్న కార్యాలయంలో వాటర్ ట్యాంకర్లు(water tankers) కనిపించడాన్ని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.


కాగా ఉపముఖ్యమంత్రి డి.కె. బెంగళూరులోని సదాశివనగర్‌లోని తన ఇంటి బోరుబావి సదాశివనగర్ సాంకీ సరస్సు పక్కనే ఉన్నప్పటికీ మొదటి సారి పూర్తిగా ఎండిపోయిందని శివకుమార్ తెలిపారు. దీంతో ప్రస్తుతం బెంగళూరు వీధుల్లో నీటి ట్యాంకర్లు సంచరించడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో నీటి సరఫరా చేసే ట్యాంకర్‌కు గతంలో రూ.700 నుంచి రూ.800 వసూలు చేసేవారు. కానీ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ప్రస్తుతం ట్యాంకర్(water tanker) రేటు రూ.1,500 నుంచి రూ.1,800కి చేరింది.

అంతేకాదు బెంగళూరులోని విజయనగర్‌లో ఉన్న ఓ కోచింగ్ సెంటర్(coaching centre) నీటి 'అత్యవసర' పరిస్థితి కారణంగా తమ విద్యార్థులను వారం రోజుల పాటు ఆన్‌లైన్ తరగతులు(online classes) తీసుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు బన్నెరఘట్ట రోడ్డులో ఉన్న పాఠశాలను(schools) కూడా మూసివేసి విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించాలని సూచించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Congress: ఉమెన్స్ డే సందర్భంగా ప్రధాని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న కాంగ్రెస్

Updated Date - Mar 08 , 2024 | 11:22 AM

Advertising
Advertising