Bengaluru Recorded: బెంగుళూరులో రికార్డు సృష్టించిన ‘వర్షం’
ABN, Publish Date - Jun 03 , 2024 | 07:48 PM
భారీ వర్షంతో బెంగుళూరు మహానగరం తడిసి ముద్దయింది. బెంగుళూరులో ఆదివారం ఒకే రోజు 111.1 మి.మి వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. 133 ఏళ్ల క్రితం బెంగుళూరులో ఒకే రోజు 101.6 మి.మి వర్షపాతం నమోదై.. రికార్డు సృష్టించిందని తెలిపారు.
బెంగుళూరు, జూన్ 03: భారీ వర్షంతో బెంగుళూరు మహానగరం తడిసి ముద్దయింది. బెంగుళూరులో ఆదివారం ఒకే రోజు 111.1 మి.మి వర్షం కురిసిందని భారత వాతావరణ శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. 133 ఏళ్ల క్రితం బెంగుళూరులో ఒకే రోజు 101.6 మి.మి వర్షపాతం నమోదై.. రికార్డు సృష్టించిందని తెలిపారు. అయితే ఆ రికార్డును అధిగమించి జూన్ 2వ తేదీన వర్షం కురిసిందని అధికారులు పేర్కొన్నారు. 1891, జూన్ 16వ తేదీన బెంగళూరు నగరంలో 101.6 మి.మి మేర వర్షం కురిసిందని... ఆ తర్వాత మళ్లీ అంత వాన ఈ 133 ఏళ్లలో కురవలేదన్నారు. అయితే ఆదివారం ఆ రికార్డును మించిన వర్షపాతం నమోదు అయిందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు.
Also Read: Nishant Agarwal: పాక్‌కు ‘బ్రహ్మోస్’ లీక్ చేసిన ఇంజినీర్‌కు యావజీవ శిక్ష విధించిన కోర్టు
మరోవైపు ఈ భారీ వర్షం కారణంగా బెంగుళూరు మహానగరంలో వర్షపు నీటి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. అలాగే ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక మహానగరంలోని జయానగర్, ఎలక్ట్రానిక్ సిటీ, ఎంజీ రోడ్డు, ఇందిరానగర్, ఫర్జర్ టౌన్ తదితర ప్రాంతాలు వర్షపు నీరులో మునిగిపోయాయి. ఇంకోవైపు భారీ వర్షం, ఈదురుగాలులకు వివిధ ప్రాంతాల్లోని భారీ వృక్షాలు నెలకొరిగాయి. అవి రహధారిపై నిలిపిన వాహనాలపై పడడంతో.. అవి పూర్తిగా ధ్వంసమైనాయి. భారీ వర్షంతో వివిధ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దాంతో నగరంలోని పలు ప్రాంతాలు గాడాంధకారంలో ఉండిపోయాయి.
Also Read: Nitheesha Kandula: యూఎస్‌లో మరో భారతీయ విద్యార్థి అదృశ్యం
మహానగరంలో భారీ వర్షాలపై డిప్యూటీ సీఎం డికె శివకుమార్ స్పందించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో త్వరలో పర్యటిస్తానని ఆయన పేర్కొన్నారు. అలాగే దీనిపై ఉన్నతాధికారులతో సమీక్షించనున్నట్లు తెలిపారు. ఈ భారీ వర్షాలపై బీజేపీ నేత, బెంగుళూరు దక్షిణ లోక్‌సభ సభ్యుడు తేజస్వీ సూర్య ఎక్స్ వేదికగా స్పందించారు. నగరం వర్షపు నీటిలో చిక్కుకు పోయిందన్నారు. ఈ ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు చేపట్టలేదంటూ ఎక్స్‌లో కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు సందించారు. భారీ వర్షాల కారణంగా.. బెంగుళూరులో ఎల్లో అలెర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది.
Also Read: Air India Express Flight: యువకుడు హల్‌చల్: ఎయిర్‌పోర్ట్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్
Read Latest Telangana News and National News
Updated Date - Jun 03 , 2024 | 07:55 PM