Bengaluru: కారుపై పడ్డ కంటెయినర్
ABN, Publish Date - Dec 22 , 2024 | 02:49 AM
బెంగళూరు శివారులో రోడ్డుపై వెళుతున్న కారుపై ఎదురుగా వస్తూ అదుపుతప్పిన కంటెయినర్ పడటంతో ఓ కుటుంబంలోని మొత్తం ఆరుగురు అక్కడికక్కడే కన్నుమూశారు.
బెంగళూరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
ఇద్దరు పిల్లలు సహా ఆరుగురి దుర్మరణం
మృతులంతా ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ కుటుంబ సభ్యులు
ముందున్న కారును తప్పించబోయి డివైడర్ దాటిన కంటెయినర్
బెంగళూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): బెంగళూరు శివారులో రోడ్డుపై వెళుతున్న కారుపై ఎదురుగా వస్తూ అదుపుతప్పిన కంటెయినర్ పడటంతో ఓ కుటుంబంలోని మొత్తం ఆరుగురు అక్కడికక్కడే కన్నుమూశారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో జరిగింది. ముందు వెళుతున్న కారు ఒక్కసారిగా ఆగడంతో దాన్ని తప్పించబోయిన కంటెయినర్.. డివైడర్ ఎక్కి పక్కరోడ్డుపైకి వెళ్లింది. ఎదురుగా వస్తున్న మరో కంటెయినర్‌ను తప్పించే క్రమంలో అది అటుగా వస్తున్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న ఐఏఎ్‌సటీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ కంపెనీ సీఈఓ చంద్ర యాగపగోళ్ (48), ఆయన భార్య గౌరాబాయి (42), కుమారుడు ధ్యాన్ (16), కూతుళ్లు దీక్ష (12), ఆర్య(8), సోదరుడి భార్య (36) మృతి చెందారు. మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా మొరబగి గ్రామానికి చెందిన చంద్ర యాగపగోళ్ బెంగళూరు హెచ్‌ఎ్‌సఆర్ లే అవుట్‌లో నివాసం ఉంటున్నారు.
Updated Date - Dec 22 , 2024 | 02:49 AM