ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru : కన్నడిగులకు ఫోన్‌పే సీఈవో క్షమాపణలు

ABN, Publish Date - Jul 23 , 2024 | 05:41 AM

కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాల రిజర్వేషన్‌ అంశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫోన్‌ పే సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సమీర్‌ నిగమ్‌ క్షమాపణ చెప్పారు.

బెంగళూరు, జూలై 22(ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో కన్నడిగులకు ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమల్లో ఉద్యోగాల రిజర్వేషన్‌ అంశానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఫోన్‌ పే సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సమీర్‌ నిగమ్‌ క్షమాపణ చెప్పారు. ప్రైవేట్‌ సంస్థలు, పరిశ్రమల ఉద్యోగాల్లో కన్నడిగులకు రిజర్వేషన్‌ కల్పించాలని గతవారం రాష్ట్ర కేబినెట్‌లో తీర్మానం చేశారు.

దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈలోగానే సమీర్‌ నిగమ్‌ తీవ్రంగా స్పందించారు. తాను దేశవ్యాప్తంగా వేలాదిమందికి ఉద్యోగాలు కల్పించానని, తన పిల్లలు కర్ణాటకలో ఉద్యోగానికి అర్హులు కారా..? అని వ్యాఖ్యానించారు.

సమీర్‌ వ్యాఖ్యలపై కన్నడిగులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోన్‌ పే యాప్‌ను బాయ్‌కాట్‌ చేయాలని సోషల్‌మీడియాలో డిమాండ్‌ జోరుగా సాగింది. దీంతో.. కర్ణాటకను, కన్నడిగులకు అవమానించే ఉద్దేశం తనకు లేదని, కర్ణాటక సర్కారు, కన్నడిగుల మద్దతుకు సదా కృతజ్ఞుడినని ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Updated Date - Jul 23 , 2024 | 05:53 AM

Advertising
Advertising
<