ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru : బుక్‌బ్రహ్మ ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం

ABN, Publish Date - Aug 12 , 2024 | 04:01 AM

బుక్‌బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు.

  • ప్రముఖ రచయిత జయమోహన్‌కు బుక్‌బ్రహ్మ సాహిత్య పురస్కారం

బెంగళూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): బుక్‌బ్రహ్మ సాహిత్య ఉత్సవ్‌లో తెలుగు సాహిత్య సౌరభం వెల్లివిరిసింది. మూడురోజులపాటు సాగిన ఉత్సవంలో వందలాదిమంది తెలుగు రచయితలు, సాహితీ అభిలాషులు పాల్గొన్నారు. ఐదు వేదికల ద్వారా 50కి పైగా చర్చాగోష్టులు, పుస్తకావిష్కరణలు నిర్వహించారు. పలు సమీక్షల్లో ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె.శ్రీనివాస్‌ భాగస్వాములయ్యారు.

తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మళయాళ భాషల ప్రముఖ రచయితలు పాల్గొన్నారు. చివరిరోజు ఆదివారం వేలాదిమంది సందర్శకులతో బెంగళూరు సెయింట్‌జాన్స్‌ ఆడిటోరియం కిటకిటలాడింది. ‘నెమ్మి నీలం’ పుస్తకావిష్కరణతోపాటు ‘తెలుగు కథా ప్రపంచం’ అనే అంశంపై చర్చాగోష్టి నిర్వహించారు. నాగర్‌కోయిల్‌కు చెందిన తమిళం, మళయాళ భాషల ప్రముఖ రచయిత జయమోహన్‌కు బుక్‌బ్రహ్మ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు.

రబ్బర్‌, కాడు, విష్ణుపురం, ఈజంపులగంతోపాటు ఎన్నో కృతులు ఆయన రచించారు. 2005లో ప్రసిద్ధమైన ఆధునిక మహాకావ్యం కొట్రవై ద్వారా గుర్తింపు పొందారు. జయమోహన్‌కు బుక్‌ బ్రహ్మ ఉత్సవ్‌ సాహిత్య పురస్కారం, జీవన సాఫల్య పురస్కారంతోపాటు రూ.2లక్షల నగదు అందజేశారు.

Updated Date - Aug 12 , 2024 | 04:01 AM

Advertising
Advertising
<