ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru Police: సిగ్నల్ క్రాస్ చేసినా జరిమానా ఉండదు..!!

ABN, Publish Date - Jul 15 , 2024 | 07:18 PM

బెంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాహనదారులు రెడ్ సిగ్నల్ దాటినా ఫైన్ ఉండదని స్పష్టం చేశారు. అందుకు స్పష్టమైన కారణం ఉంది. అంబులెన్స్‌కు దారి ఇచ్చే సమయంలో సిగ్నల్ దాటినా పరిగణలోకి తీసుకోరట. ఒకవేళ మీ వెహికిల్‌కు ఫైన్ పడినా మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు.

Bengaluru Traffic Police

బెంగళూర్: బెంగళూర్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాహనదారులు రెడ్ సిగ్నల్ దాటినా ఫైన్ ఉండదని స్పష్టం చేశారు. అందుకు స్పష్టమైన కారణం ఉంది. అంబులెన్స్‌కు దారి ఇచ్చే సమయంలో సిగ్నల్ దాటినా పరిగణలోకి తీసుకోరట. ఒకవేళ మీ వెహికిల్‌కు ఫైన్ పడినా మినహాయింపు ఇస్తామని స్పష్టం చేశారు.


ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్న కెమెరాలు ఐదు సెకన్లకు ఒకసారి వాహనదారుల కదలికలు రికార్డ్ చేస్తాయి. అంబులెన్స్‌కు దారి ఇచ్చే సమయంలో సిగ్నల్ జంప్ చేసినట్టు గుర్తిస్తే ఫైన్ పడదు. ఒకవేళ పడినా మినహాయిస్తారు. ట్రాఫిక్ సిగ్నల్స్ అంబులెన్స్‌లను గుర్తించి రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్‌లోకి మారేలా జియో ఫెన్సింగ్ చేశామని స్పష్టం చేశారు. సిటీలో 80 అంబులెన్స్‌లకు జీపీఎస్ అమర్చామని ఆరోగ్య శాఖ పేర్కొంది. 100 మీటర్ల దూరంలో అంబులెన్స్ ఉన్నప్పటికీ సిగ్నల్స్ గుర్తిస్తాయని స్పష్టం చేసింది.


రహదారులపై ఏఐ సీసీటీవీ కెమెరాలు అమరుస్తామని పోలీసులు చెబుతున్నారు. సేఫ్ సిటీ ప్రాజెక్ట్ మూడో దశలో భాగంగా రైల్వేస్టేషన్లు, ఎయిర్ పోర్ట్, చిన్నస్వామి స్టేడియంలో 150 వాచ్ టవర్లు, 8 హై డెఫినేషన్ ఫేస్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

For Latest News and National News click here

Updated Date - Jul 15 , 2024 | 07:18 PM

Advertising
Advertising
<