ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru: ముడుపుల ఆరోపణలపై ‘విజయేంద్ర’ ఆగ్రహం..

ABN, Publish Date - Dec 17 , 2024 | 01:05 PM

వక్ఫ్‌ ఆస్తుల నివేదికను బహిరంగం చేయరాదని అన్వర్‌ మానప్పాడికి రూ.150కోట్లు ముడుపులు ఇస్తాననే ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభ కలాపాలలో విజయేంద్ర సోమవారం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

- సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని సీఎంకు సవాల్‌

- సభలో అధికార, ప్రతిపక్షాల వాగ్వాదం

బెంగళూరు: వక్ఫ్‌ ఆస్తుల నివేదికను బహిరంగం చేయరాదని అన్వర్‌ మానప్పాడికి రూ.150కోట్లు ముడుపులు ఇస్తాననే ఆరోపణలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాసనసభ కలాపాలలో విజయేంద్ర సోమవారం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వక్ఫ్‌ ఆస్తుల అక్రమాలకు సంబంధించి మౌనంగా ఉండాలని 150 కోట్లు ఇవ్వచూపానని సీఎం సిద్దరామయ్య నేరుగా తనపై ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రియాంక ఖర్గే తొలుత ఈ ఆరోపణలు చేయగా ఆ తర్వాత సీఎం, డీసీఎంలతోపాటు పలువురు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Tirumala: తిరుమలలోనూ ఇకపై హెల్మెట్‌ తప్పనిసరి..


తనకు ఎటువంటి సంబంధం లేదని అయినా తనపై ఆరోపణలు చేశారని, సీబీఐ ద్వారా విచారణ జరిపించాలని ప్రభుత్వానికి సవాల్‌ విసిరారు. వక్ఫ్‌ ఆస్తుల దుర్వినియోగానికి సంబంధించి అన్వర్‌ మానప్పాడి తొలుత నివేదిక ఇచ్చారని ఆ తర్వాత ఉపలోకాయుక్త న్యాయమూర్తి మరోనివేదిక ఇచ్చారన్నారు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న సీఎం సిద్దరామయ్య నివేదిక బహిరంగం కాకుండా మూసివేశారన్నారు. తాను ముఖ్యమంత్రికి సవాల్‌ చేస్తున్నా అన్నారు. అన్వర్‌ మానప్పాడి నివేదికను సీబీఐకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


అవినీతి కుంభకోణంలో ఇరుక్కుపోయిన సీఎం తనను విమర్శిస్తున్నారని ఇలా హిట్‌ అండ్‌ రన్‌ చేయడం తగదని విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కాగా డీసీఎం డీకే శివకుమార్‌ సువర్ణసౌధలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ అన్వర్‌ మానప్పాడి రాజకీయ ఒత్తిడితో యూటర్న్‌ తీసుకున్నారన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్‌మీడియాలో చూశానని, ప్రధాని, హోం మంత్రిలకు లేఖ రాశానని అప్పట్లో చెప్పారన్నారు. సీబీఐ విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తే ఆ తర్వాత పరిశీలిస్తామన్నారు.


నివేదిక మూసివేసే కుట్ర కాంగ్రెస్‏దే...

కాగా ఇదే విషయమై అన్వర్‌ మానప్పాడి మంగళూరులో మీడియాతో మాట్లాడుతూ.. 2013-14లో వక్ఫ్‌ ఆస్తుల అక్రమాలపై నివేదిక తయారు చేసేవేళ విజయేంద్రకు ఎటువంటి పదవులు లేవన్నారు. కేవలం యడియూరప్ప(Yediyurappa) కుమారుడు మాత్రమేనన్నారు. 2019లో యడియూరప్ప సీఎంగా ఉన్నప్పుడు నివేదిక అమలు చేయాలని డిమాండ్‌ చేశానన్నారు. నివేదికను అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశానని ప్రధానికి లేఖ రాశానన్నారు. అయితే ఈ నివేదిక మూసివేయాలని విజయేంద్ర ఆఫర్‌ ఇవ్వలేదన్నారు.


కానీ కాంగ్రెస్‌ నాయకులే వేల కోట్ల రూపాయలు ఆఫర్‌ ఇచ్చారన్నారు. ఎందుకంటే వక్ఫ్‌ ఆస్తులు అక్రమాలకు పాల్పడింది. కాంగ్రెస్‌ పార్టీవారేనన్నారు. కాంగ్రెస్‏లో పెద్దమనుషులున్నారన్నారు. నేను నివేదికలో 27వేల ఎకరాలు ఆక్రమణ జరిగిందని గుర్తించానన్నారు. కానీ సీఎం సిద్దరామయ్య 1.60 లక్షల ఎకరాలకు నోటీసులు ఇచ్చారన్నారు. ఇదో బోగస్‌ అన్నారన్నారు. వక్ఫ్‌ ఆస్తులు కాజేసిన ప్రముఖులను విస్మరించి సామాన్య రైతులకు నోటీసులు ఇచ్చారన్నారు. సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు.


ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు

ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో

ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న

Read Latest Telangana News and National News

Updated Date - Dec 17 , 2024 | 01:05 PM