Bengaluru: వక్క.. లాభాలు పక్కా....
ABN, Publish Date - Dec 25 , 2024 | 12:52 PM
ఈ ఏడు వక్క సాగులో లాభాలు ఆశాజనకంగా ఉన్నాయని, రైతులు ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలపై ఆసక్తి పెంచుకోవాలని వ్యవసాయ అధికారి ప్రసాద్(Agriculture Officer Prasad) సూచించారు.
కంప్లి(బెంగళూరు): ఈ ఏడు వక్క సాగులో లాభాలు ఆశాజనకంగా ఉన్నాయని, రైతులు ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలపై ఆసక్తి పెంచుకోవాలని వ్యవసాయ అధికారి ప్రసాద్(Agriculture Officer Prasad) సూచించారు. గురువారం కంప్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు పలు సూచనలు అందజేశారు. కూడ్లిగి పరిధిలోని పలు గ్రామాల రైతులు బంజరు భూముల్లోను, బోర్ల కింద రైతులు వక్క పంట సాగు చేశారని, దిగుబడి ఆశాజనకంగా ఉందన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Minister: మంత్రిగారి సవాల్.. ధర్మస్థళలో ప్రమాణానికి సిద్ధమా..
ఇతర పంటలు నష్టపోతుండంతో పలువురు రైతులు వక్కసాగుపై ఆసక్తి చూపుతు న్నారన్నారు. గుడేకోట వద్ద ఇప్పటికే మొక్కలు కూడా దొరుకుతు న్నాయన్నారు. రైతులు అధికారుల సూచనలతో పంటను ప్రారంభించా లన్నారు. ఖానాహోసళ్లి రైతు రాముడు(Ramudu) మాట్లాడుతూ... యేటా ఖరీఫ్, రబీ(Kharif, Rabi)లో వాతావరణ మార్పు, వర్షాప్రభావం వల్ల బోర్ల కింద వేసుకున్న వరిపంట బాగా నష్టపోతుందన్నారు. అప్పులు కట్టలేక ఇబ్బంది పడుతున్నామన్నారు.
నాలుగేళ్ల కింద వక్క సాగు చేశాననీ, రెండు, మూడు సంవత్సరాలుగా మంచి దిగుబడి వస్తోందన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించవచ్చన్నారు. తక్కువ నీరున్న డ్రిప్ ద్వారా కూడా ఈ పంటను సాగు చేయవచ్చు, ఏ వాతావరణాన్ని అయినా తట్టుకునే శక్తి ఈ పంటకు ఉందన్నారు. హరప్పనహళ్లి, కూడ్లిగి ఈ ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కడ చూసినా వక్క పంటలే కనిపిస్తు న్నాయన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!
ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు
ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు
Read Latest Telangana News and National News
Updated Date - Dec 25 , 2024 | 12:52 PM