మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Maharashtra: మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు భారీ షాక్.. కారు దిగుతున్న నేతలు..

ABN, Publish Date - Mar 19 , 2024 | 03:33 PM

బీఆర్‌ఎస్‌ను కష్టాలు వీడటం లేదు. ఓ వైపు తెలంగాణలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని గుడ్‌బై చెబుతుంటే.. పక్క రాష్ట్రం మహారాష్ట్ర(Maharashtra)లోనూ బీఆర్‌ఎస్ నేతలు కారు దిగి వేరే పార్టీల్లో చేరుతున్నారు. లోక్‌సభ(Lok Sabha) ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పోటీపై బీఆర్‌ఎస్ (BRS) అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు.

కిసాన్‌ సెల్ రాష్ట్ర అధ్యక్షులు రాజీనామా

తాజాగా మహారాష్ట్ర కిసాన్‌ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాణిక్‌రావు కదం బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేశారు. ఆయనతో పాటు పలువురు స్థానిక నాయకులు కారు దిగి వెళ్లిపోతున్నారు. మానిక్‌రావు కదం మహారాష్ట్రలో ప్రముఖ నాయకుడిగా ఉన్నారు. గతంలో కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి.. జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారు. మొదటగా మహారాష్ట్రలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా మహారాష్ట్రలో పలు పార్టీల నాయకులను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు.

మారిన సమీకరణాలు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. తెలంగానలో బీఆర్‌ఎస్ ఓటమి చెందటంతో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ కొంత నిరుత్సాహనికి లోనయ్యారు. ప్రస్తుతం తెలంగాణలోని లోక్‌సభ స్థానాపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. దీంతో మహారాష్ట్ర నేతలు కేసీఆర్‌ వైఖరిపై అసంత‌ృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్‌ను వీడిన మాణిక్‌రావు కదం ఎన్సీపీలో చేరారు. గత ఏడాది జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు కొంతమేర ప్రభావం చూపించగలిగారు. దీంతో మహారాష్ట్రలో ఇక నుంచి జరగబోయే ఎన్నికల్లో పోటీచేయాలని కేసీఆర్ భావించారు. కాని తెలంగాణలో ఫలితాల తర్వాత గులాబీ బాస్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 19 , 2024 | 03:33 PM

Advertising
Advertising