Nitish Kumar: తలుపులు తెరిచే ఉన్నా నేను వెళ్లను.. లాలూకు నితీశ్ కౌంటర్..
ABN, Publish Date - Feb 17 , 2024 | 01:07 PM
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని వీడి ఎన్డీఏలో చేరిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గతాన్ని విస్మరించి సరికొత్తగా ముందుకు వెళ్దామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.
బిహార్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. మిత్రపక్షాన్ని వీడి ఎన్డీఏలో చేరిన నితీశ్ మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. గతాన్ని విస్మరించి సరికొత్తగా ముందుకు వెళ్దామని ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం అసెంబ్లీ వెలుపల సమావేశమయ్యారు. ఈ చర్చ బిహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమావేశం అనంతరం లాలూ ప్రసాద్ చేసిన కామెంట్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. మిత్రపక్షంలో చేరేందుకు నితీశ్ కు తలుపులు మూసుకుపోలేదని, ఇంకా తెరిచే ఉన్నాయని అన్నారు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చని చెప్పారు. తాజాగా ఈ స్టేట్మెంట్ పై నితీస్ స్పందించారు. తలుపులు తెరిచే ఉన్నా తాను తిరిగి వెళ్లేది లేదని స్పష్టం చేశారు.
"ఎవరు ఏం చెప్పినా మోసపోవద్దు. మేమంతా మునుపటిలా కలిసి తిరిగి వచ్చాం. ఎలాంటి అవకతవకలు జరిగినా విచారణ జరుపుతాం. వారితో కలిసి ఉండటం సరికాదని భావించే బయటకు వచ్చేశాం" అని డోర్ ఈజ్ ఓపెన్ ఆఫర్ పై నితీశ్ అన్నారు. నిజానికి లాలూ ప్రసాద్, నితీశ్ కుమార్‌లు అసెంబ్లీ వెలుపల ఒకరినొకరు పలకరించుకున్నారు. నితీశ్ బయటకు వస్తున్న సమయంలో లాలూ తన భార్య రబ్రీ దేవితో కలిసి అసెంబ్లీ లోపలికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఆప్యాయంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 17 , 2024 | 01:07 PM