ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

NDA: మోదీ వెంటే కలిసి నడుస్తాం.. ఎన్డీఏ పక్ష సమావేశంలో నితీశ్

ABN, Publish Date - Jun 07 , 2024 | 01:25 PM

ఎన్డీఏ(NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును(PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు మోదీని బలపరిచారు.

ఢిల్లీ: ఎన్డీఏ(NDA) పక్షనేతగా ప్రధాని మోదీ పేరును(PM Modi) రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్, మిగతా ఎన్డీఏ పక్ష సభ్యులు మోదీని బలపరిచారు. ఈ సందర్భంగా నితీశ్ మాట్లాడుతూ...

"ఏ సందర్భంలోనైనా మేం మీతోనే(మోదీ) ఉంటాం. ఇండియా కూటమి నేతలు ఈ సారి పొరపాటున గెలిచారు. దేశం కోసం వారేమైనా చేశారా? వారంతా వచ్చే ఎన్నికల్లో ఓడిపోతారు. దేశం ఇకపై బృహత్తర ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్తుంది. మీ నేతృత్వంలో మేమంతా కలిసి పని చేస్తాం. బిహార్‌లో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తాం. ఎన్డీఏ పక్షాలన్ని ఏకతాటిపైకి రావడం సంతోషం. ప్రధానిగా మోదీ ఆదివారం ప్రమాణం చేస్తున్నారు. కానీ ఇవాళ్లే ప్రమాణ స్వీకారం చేయాలని కోరుకుంటున్నా. ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసినా మీతోనే నడుస్తాం" అని నితీశ్ పేర్కొన్నారు.


పార్లమెంట్ సెంట్రల్ హాల్లో..

పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ స‌మావేశంలో లోక్ సభ ప‌క్ష నేతగా న‌రేంద్ర మోదీని ఏక‌గ్రీవంగా ఎన్నుకున్నారు. మోదీ పేరును రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపాదించగా అమిత్ షా, చంద్రబాబు, నితిన్ గడ్కరీ, నితీష్ కుమార్‌, ఏక్‌నాథ్ షిండే, పవన్ కళ్యాణ్ తదితరులు బ‌ల‌ప‌రిచారు.

For Latest News and National News click here

Updated Date - Jun 07 , 2024 | 01:27 PM

Advertising
Advertising