ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sunstroke: హీట్ వేవ్ ఎఫెక్ట్.. 107 డిగ్రీల జ్వరంతో ఓ కార్మికుడు మృతి

ABN, Publish Date - May 30 , 2024 | 12:01 PM

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. ఈ క్రమంలో వేడిగాలుల(Sunstroke) కారణంగా ఢిల్లీలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండ వేడిమికి ఓ 40 ఏళ్ల కార్మికుడు మృత్యువాత చెందాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Bihar man dies 107 degree fever due to sunstroke

దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఎండ తీవ్రత విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల సెల్సియస్‌ను దాటేశాయి. ఈ క్రమంలో వేడిగాలుల(Sunstroke) కారణంగా ఢిల్లీలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎండ వేడిమికి ఓ 40 ఏళ్ల కార్మికుడు మృత్యువాత చెందాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. బీహార్‌లోని దర్భంగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి నిన్న దేశ రాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో వేడిగాలులు రావడంతో హీట్‌స్ట్రోక్‌కు గురయ్యాడు. ఆ క్రమంలో అతనికి జ్వరం రావడంతో సోమవారం అర్ధరాత్రి తర్వాత రూమ్‌మేట్స్, ఇతర ఫ్యాక్టరీ కార్మికులు రామ్ మనోహర్ లోహియా(Ram Manohar Lohia hospital) ఆసుపత్రికి తీసుకెళ్లారు.


అతనికి చికిత్స చేసిన ఒక వైద్యుడు(doctor) అతను కూలర్ లేదా ఫ్యాన్ లేని గదిలో నివసిస్తున్నాడని తెలుసుకున్నారు. ఆ క్రమంలో అతనికి తీవ్రమైన జ్వరం ఉందని 107 డిగ్రీల సెల్సియస్ మార్కును దాటినట్లు డాక్టర్ చెప్పారు. సాధారణం కంటే ఇది దాదాపు 10 డిగ్రీలు ఎక్కువగా ఉంది. ఆ 40 ఏళ్ల వ్యక్తి మంగళవారం సాయంత్రం వరకు ఆస్పత్రిలోనే చికిత్స తీసుకున్నాడు. బుధవారం ఉదయం అతన్ని వార్డుకు తరలించారు.

ఆ క్రమంలోనే ఆయన పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మృత్యువాత చెందాడు. ఈ ఎండాకాలంలో ఢిల్లీ(delhi)లో హీట్‌ స్ట్రోక్‌ కారణంగా నమోదైన తొలి మరణం ఇదే కావడం విశేషం. దర్భంగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఢిల్లీలోని పైప్‌లైన్ ఫిట్టింగ్‌ల తయారీ ఫ్యాక్టరీలో ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు.


ఇక దేశ రాజధానిలో ఇటివల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగర శివార్లలోని ముంగేష్‌పూర్‌లో 52.9 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఢిల్లీ వాసుల విద్యుత్ కూడా పెరిగిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోయి నీటి సంక్షోభం కూడా దేశ రాజధానిలో కొనసాగుతుందని అధికారులు చెప్పారు. అంతేకాదు ముంగేష్‌పూర్ ప్రాంతంలో రికార్డ్ రీడింగ్ సెన్సార్ లోపం వల్ల జరిగిందా లేదా స్థానిక కారణాల వల్ల జరిగిందా అని వాతావరణ కార్యాలయం ఇప్పుడు దర్యాప్తు చేస్తుండటం విశేషం.


ఇది కూడా చదవండి:

Loksabha election 2024: లోక్‌సభ ఎన్నికల ఏడో దశ ప్రచారం నేడే లాస్ట్


Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


For More National News and Telugu News..

Updated Date - May 30 , 2024 | 12:02 PM

Advertising
Advertising