Bihar Political Crisis: బీజేపీకి థ్యాంక్స్ చెప్పిన తేజస్వీ యాదవ్.. పెద్ద ప్లానే ఉందిగా..!
ABN, Publish Date - Jan 28 , 2024 | 05:14 PM
Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్‌బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్.
Tejashwi Yadav First Reaction On Nitish: నితీష్ కుమార్ యాదవ్ మహాఘట్‌బంధన్ నుంచి వైదొలిగిన తరువాత తొలిసారి స్పందించారు ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్. జేడీ(యూ)(JDU)-బీజేపీ(BJP) కలిసి అధికారం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.. కానీ, బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు, అసలు గేమ్ ముందుంది అని ఫస్ట్ కామెంట్ చేశారు తేజస్వి యాదవ్. ‘ప్రస్తుత సమయంలో బీజేపీకి శుభాభినందనలు మాత్రమే చెబుతాను. నితీష్ కుమార్‌ను, ఆయన పార్టీని తమతో పాటు తీసుకెళ్లినందుకు బీజేపీకి నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారు ప్రమాణ స్వీకారం చేయనివ్వండి. బీహార్‌లో ఆట ఇంకా ముగియలేదు.’ అని కామెంట్స్ చేశారు తేజస్వి యాదవ్.
ముఖ్యమంత్రిగా తొమ్మిదోసారి..
కాగా, బీహార్ సీఎం నితీష్ కుమార్.. మహాఘట్‌బంధన్ కూటమి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఆర్జేడీ, కాంగ్రెస్‌కు కటీఫ్ చేప్పిన నితీష్.. బీజేపీతో జట్టు కట్టి బీహార్‌లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. నితీష్ ముఖ్యమంత్రిగా, బీజేపీ నుంచి ఇద్దరు నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ సీఎంలుగా ఉండనున్నారు. ఇక, బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తొమ్మిదోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్ని సీట్లు కావాలంటే..
243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 122 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. ఇప్పుడు జేడీయూకి బీజేపీ సపోర్ట్ ఇవ్వడంతో ఎమ్మెల్యేల సంఖ్య 127కి చేరింది. దీంతో బీహార్‌లో ఇప్పుడు జేడీయూ-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది.
Updated Date - Jan 28 , 2024 | 05:14 PM