Odisha Assembly Election Result: నవీన్ పట్నాయక్‌కు షాక్.. ఆధిక్యంలోకి దూసుకెళ్తున్న బీజేపీ!
ABN, Publish Date - Jun 04 , 2024 | 01:17 PM
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది.
ఆరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించాలనుకున్న ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కలలు కల్లలయ్యేలా ఉన్నాయి. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పని చేసిన రికార్డు దక్కించుకోవాలనుకున్న నవీన్ పట్నాయక్ ఆశలకు బీజేపీ గండికొడుతోంది. ప్రస్తుత కౌంటింగ్ సరళి ప్రకారం ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు వెళ్తోంది. స్వయంగా నవీన్ పట్నాయక్ కొన్ని రౌండ్లలో వెనుకబడి ఉండడం గమనార్హం.
ఒడిశాలో మొత్తం 147 స్థానాలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ ప్రకారం.. బీజేపీ మేజారిటీ మేజిక్ ఫిగర్‌ను దాటేసి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఒడిశాలో అధికారం సంపాదించాలంటే కావాల్సిన అసెంబ్లీ సీట్లు 74. ప్రస్తుతం బీజేపీ 78 సీట్లలో ఆధిక్యంలో ఉంది. నవీన్ పట్నాయక్‌కు చెందిన బీజేడీ అభ్యర్తులు 54 సీట్లలోనే ఆధిక్యంలో ఉన్నారు. మంత్రులుగా పని చేసిన పలువురు వ్యక్తులు కూడా వెనుకంజలో ఉండడం గమనార్హం.
నవీన్ పట్నాయక్ కాంటాబాంజి అసెంబ్లీ స్థానంలో వెనుకబడి ఉన్నారు. అయితే రెండో స్థానమైన హింజలి అసెంబ్లీ స్థానంలో మాత్రం ఆధిక్యంలో ఉన్నారు. ఇక, ఒడిశా లోక్‌సభ్ ఎన్నికల్లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. మొత్తం 21 లోక్‌సభ స్థానాలకు గానూ 18 సీట్లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. రెండో చోట్ల బీజేడీ, ఒక్కచోట కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
Updated Date - Jun 04 , 2024 | 01:17 PM