Delhi: బిహార్ రాజకీయ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాం.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్
ABN , Publish Date - Jan 27 , 2024 | 01:45 PM
బిహార్(Bihar Politics) రాజకీయ పరిస్థితులను కేంద్ర బీజేపీ(BJP) నాయకత్వం అనుక్షణం పర్యవేక్షిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ నేతలు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారన్నారు.
బిహార్: బిహార్(Bihar Politics) రాజకీయ పరిస్థితులను కేంద్ర బీజేపీ(BJP) నాయకత్వం అనుక్షణం పర్యవేక్షిస్తోందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర బీజేపీ నేతలు పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారన్నారు.
"ప్రస్తుతం నితీష్ కుమార్(CM Nitish Kumar) బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. లాలూ ప్రసాద్ నేతృత్వంలోని RJD, కాంగ్రెస్‌లు మహాఘట్ బంధన్ ప్రభుత్వంలో భాగస్వాములు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను మా కేంద్ర నాయకత్వం పర్యవేక్షిస్తోంది. రాజకీయాల్లో ఎప్పటికీ తలుపులు మూసి ఉండవు. ఎన్డీఏలో చేరాలనుకునేవారు చేరవచ్చు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం" అని అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి