ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Atishi: ఢిల్లీలో రాష్ట్రపతి పాలనకు బీజేపీ కుట్ర... అతిషి సంచలన ఆరోపణ

ABN, Publish Date - Sep 10 , 2024 | 09:20 PM

ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వాన్ని కుప్పకూలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మొత్తం 70 సీట్లు కట్టబెట్టడం ద్వారా ప్రజలే బీజేపీకి గట్టి గుణపాఠం చెబుతారని, బీజేపీకి జీరో స్కోర్‌కే పరిమితమవుతుందని అతిషి తెలిపారు.

న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఢిల్లీలోని 'ఆప్' (AAP) ప్రభుత్వాన్ని కూలదూసేందుకు బీజేపీ (BJP) కుట్ర పన్నుతోందని, దొడ్డిదారిన రాష్ట్రపతి పాలన (President Rule) విధించడం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటోందని ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి (Atishi) మంగళవారంనాడు తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ రాజ్యాంగ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సమర్పించిన మెమొరాండంను రాష్ట్రపతి సచివాలయం హోం మంత్రిత్వ శాఖ (MHA)కు పంపిన నేపథ్యంలో అతిషి తాజా ఆరోపణలు చేశారు.

Kolkata: సుప్రీం గడువు ముగిసినా విధుల్లోకి చేరని డాక్టర్లు, 51 మందికి నోటీసులు


అదే చేస్తే బీజేపీకి జీరో స్కోర్..

ఆప్ ప్రభుత్వాన్ని కుప్పకూలిస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు మొత్తం 70 సీట్లు కట్టబెట్టడం ద్వారా ప్రజలే బీజేపీకి గట్టి గుణపాఠం చెబుతారని, బీజేపీకి జీరో స్కోర్‌కే పరిమితమవుతుందని అతిషి తెలిపారు. ''ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఆపరేషన్ కమలం పేరుతో కూల్చివేసే చరిత్ర బీజేపీది. మహారాష్ట్ర, కర్ణాటక, మణిపూర్‌ రాష్ట్రాలు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాయి'' అని అతిషి ఉదహరించారు.


Read More National News and Latest Telugu News Click Here

Rahul Gandhi: యూఎస్ పర్యటనలో మళ్లీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Sep 10 , 2024 | 09:20 PM

Advertising
Advertising