ఖర్గే కుటుంబంపై లోకాయుక్తకు ఫిర్యాదు
ABN, Publish Date - Sep 28 , 2024 | 04:00 AM
ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుటుంబం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకుందని బీజేపీ నేత ఎన్‌ఆర్ రమేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు.
National News : ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కుటుంబం బెంగళూరులోని రెండు ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకుందని బీజేపీ నేత ఎన్‌ఆర్ రమేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. భూముల రికార్డులతో లోకాయుక్త ఐజీపీ సుబ్రమణ్యేశ్వరరావుకు శుక్రవారం ఈ ఫిర్యాదు చేశారు. ఖర్గే, ఆయన కుటుంబ సభ్యుల నేతృత్వంలోని సిద్దార్థ విహార ట్రస్టు పేరిట భారీ భూకుంభకోణానికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. 2014లో బీటీఎం లే అవుట్ 4వ స్టేజ్‌లో 8002 చదరపు మీటర్ల (86,133 చదరపు అడుగులు) విస్తీర్ణంగల నివాస స్థలాన్ని విద్యాసంస్థ అవసరాల పేరిట బీడీఏ నుంచి 30 ఏళ్లు సిద్దార్థ విహార ట్రస్టు సంస్థ లీజుకు పొందిందని అన్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించకుండా, 2024 మార్చిలో యలహంక వద్ద ఉండే హైటెక్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ పార్క్, హార్డ్‌వేర్ పార్క్‌లో ఐదు ఎకరాల విస్తీర్ణంలో నివాసస్థలాన్ని మంజూరు చేయించుకోవడం ద్వారా న్యాయ ఉల్లంఘనకు పాల్పడ్డారని అన్నారు.
Updated Date - Sep 28 , 2024 | 04:00 AM