Lok Sabha Polls: బీజేపీ మేనిఫెస్టో లీక్.. కొత్త పథకాలు ఇవే..
ABN, Publish Date - Apr 04 , 2024 | 11:06 AM
సార్వత్రిక ఎన్నికలు-2024కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీగా ఉంది. మరోవైపు గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు-2024కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19న తొలి దశ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం ఏర్పాట్లలో బిజీగా ఉంది. మరోవైపు గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తొలిదశ ఓటింగ్‌కు మరికొద్ది రోజులే మిగిలి ఉన్నప్పటికీ.. బీజేపీ (BJP) ఇంకా తన మేనిఫెస్టో విడుదల చేయలేదు. వచ్చే వారం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 19న తొలి దశ ఓటింగ్ జరగనున్న నేపథ్యంలో 10వ తేదీలోపు బీజేపీ మేనిఫెస్టో విడుదలయ్యే అవకాశం ఉంది. మోదీ హామీ, అభివృద్ధి చెందిన భారత్ 2047 పేరుతో రిలీజ్ చేసే అవకాశాలున్నాయి.
Uttar Pradesh: యూపీలో బీజేపీ కూటమి హవా.. తేలిపోనున్న ఎస్పీ: ఇండియా టీవీ సర్వే
మేనిఫెస్టోలో..
బీజేపీ మేనిఫెస్టోలో రైతులు, యువత, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేశంలో పేదలు, యువత, రైతులు, మహిళలు అనే నాలుగు అతిపెద్ద కులాలు మాత్రమే ఉన్నాయని ప్రధాని మోదీ గతంలో చాలాసార్లు చెప్పిన నేపథ్యంలో.. తన మేనిఫెస్టోలో కాషాయ పార్టీ ఈ నాలుగు వర్గాలకు కొత్త హామీలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
27మందితో కమిటీ
మేనిఫెస్టో కోసం బీజేపీ 27 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి ఛైర్మన్‌గా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యవహరిస్తున్నారు. ఈ మేనిఫెస్టోలో గత 10 ఏళ్లలో ప్రభుత్వం చేసిన పనులు, నెరవేర్చిన హామీలతో పాటు రాబోయే ఐదేళ్లు ఏం చేయబోతామనే విషయాలు పొందుపర్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలు పొందుపర్చాలనేదానిపై ప్రజల అభిప్రాయాన్ని బీజేపీ సేకరించింది.
Congress: సీటు పోటు.. సంజయ్ నిరుపమ్‌పై సస్పెన్షన్ వేటు..?
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 04 , 2024 | 01:24 PM